ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం: కీలక అంశాలపై చర్చ

Published : Dec 18, 2020, 12:04 PM IST
ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం:  కీలక అంశాలపై చర్చ

సారాంశం

ఏపీ సీఎం జగన్  అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అమరావతి: ఏపీ సీఎం జగన్  అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రెండో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఈ పథకం కింద అర్హులైన తల్లులకు రూ. 15 వేల చొప్పున ఇవ్వనున్నారు.ఈ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది జనవరి 9వ తేదీన తొలి విడత నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని కేబినెట్ ఆమోదించనుంది. ఆరు జిల్లాల్లో వాటర్ షెడ్ ల అభివృద్ధి పథకం అమలుపై కేబినెట్ చర్చించనుంది. సర్వే, బౌండరీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

రైతు భరోసా మరో విడత చెల్లింపులపై చర్చించే  అవకాశం ఉంది..రైతు భరోసాతో పాటు పశువుల ఆరోగ్య పరీక్షల ల్యాబ్ ల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై కూడ చర్చించనున్నారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు విషయమై కేబినెట్ లో చర్చించే అవకాశం లేకపోలేదు. 

PREV
click me!

Recommended Stories

తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
ఆ ఇంజ‌క్ష‌న్ల వాడ‌కంపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. 100 మెడికల్ షాపుల్లో తనిఖీలు