ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం నాడు అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం నాడు అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.
అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఎమ్మార్డీఏకు రూ. 3 వేల కోట్ల బ్యాంక్ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
విశాఖ స్టీల్ కార్పోరేషన్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసే అవకాశం ఉంది.ఈ విషయమై కార్మిక సంఘాలకు జగన్ హామీ ఇచ్చారు. స్టీల్ కార్పోరేషన్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులను కూడా మంత్రి వర్గం ఆమోదించనుంది. వచ్చే నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపైనా చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, తదితర అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 1.43 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు విషయమై కూడ కేబినెట్ లో చర్చ జరగనుంది.