గన్నవరం విమానాశ్రయంలో ప్రమాదం: విచారణకు డీజీసీఏ బృందం

By narsimha lodeFirst Published Feb 23, 2021, 11:21 AM IST
Highlights

 గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకొనన్న ప్రమాదంపై  విచారణ చేసేందుకు డీజీసీఏ బృందం మంగళవారం నాడు చేరుకొంది. 


విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకొనన్న ప్రమాదంపై  విచారణ చేసేందుకు డీజీసీఏ బృందం మంగళవారం నాడు చేరుకొంది. 

ఈ నెల 20వ తేదీన దోహా నుండి గన్నవరం చేరుకొన్న విమానానికి ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంపై డీజీసీఏ బృందం విచారణ చేయనుంది.
ప్రమాదానికి గల కారణాలపై డీజీసీఏ బృందం విచారణ చేసి నివేదికను ఇవ్వనుంది. రెండు రోజుల పాటు డీజీసీఏ బృందం విచారణ నిర్వహించనుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దోహా నుండి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకొంది.  ఈ ఘటన ఈ నెల 20వ తేదీ సాయంత్రం చోటు చేసుకొంది.

విమానం ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వే పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని డీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ, నష్టం జరగలేదని  గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధన్ రావు ప్రకటించారు.

విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానంలో 64 మంది ప్రయాణీకులున్నారు. విమానం కుడి రెక్కకు స్వల్పంగా దెబ్బతింది.

click me!