బిట్ కాయిన్... ఏపీలో రూ.200కోట్ల మోసం..

By telugu teamFirst Published Aug 13, 2019, 11:04 AM IST
Highlights

న్యూ ఢిల్లీకి చెందిన చిత్తరంజన్ షా తాను మోసపోయిన విషయాన్ని ముందుకు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అతని ఫిర్యాదు మేరకు ఆర్వోసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వారి ప్రాథమిక దర్యాప్తులో  వార్షిక నివేదికలు, బ్యాలెన్స్ షీట్లను ఇవ్వలేదని కనుగొన్నారు. దీంతో.. ఆర్వోసీ నోటీసులు జారీ చేయగా... వాటికి కూడా కంపెనీ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.

మరో బిట్ కాయిన్ మోసం వెలుగులోకి వచ్చింది. బిట్ కాయిన్ ల పేరుతో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ కంపెనీ రూ.200కోట్లు మోసం చేశారు. దీంతో... బిట్ కాయిన్ ఇండియా సాఫ్ట్ వేర్ సర్వీసె్ లిమిటెడ్ కంపెనీకి ఆర్వోసీ( రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్) అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లాకి చెందిన కంపెనీ డిపాజిటర్లు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లోని ప్రజల వద్ద నుంచి రూ.200కోట్లు వసూలు చేసి ఆ తర్వాత పంగనామం పెట్టినట్లు అధికారులు గుర్తించారు.

న్యూ ఢిల్లీకి చెందిన చిత్తరంజన్ షా తాను మోసపోయిన విషయాన్ని ముందుకు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అతని ఫిర్యాదు మేరకు ఆర్వోసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వారి ప్రాథమిక దర్యాప్తులో  వార్షిక నివేదికలు, బ్యాలెన్స్ షీట్లను ఇవ్వలేదని కనుగొన్నారు. దీంతో.. ఆర్వోసీ నోటీసులు జారీ చేయగా... వాటికి కూడా కంపెనీ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.

సదరు కంపెనీ డైరెక్టర్లు సైకం రామకృష్ణా రెడ్డి, సైకం శ్రీమన్నారాయణ  రెడ్డిలకు కూడా బ్యాలెన్స్ షీట్స్ , ఫ్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డీటైల్స్, ఆడిటర్ రిపోర్ట్స్ పంపించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా.. వారు స్పందించకపోవడం గమనార్హం.

అయితే ఈ సదరు కంపెనీ నిర్వాహకులు బిట్ కాయిన్ వ్యవహారాలను నిలిపివేసామని ప్రకటించి..ఆన్ లైన్ లో మొబైల్ యాప్, సోషల్ మీడియా సహాయంతో ఈ కార్యకాలాపాలను సాగిస్తున్నట్లు అధికారులు నిర్థారించారు. 

click me!