డిసెంబర్ 9 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

By narsimha lode  |  First Published Nov 22, 2019, 1:56 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుండి  సమావేశాలు జరగనున్నాయి.సుమారు 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 9వ తేదీన జరిగే బీఎసీ సమావేశంలో  అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.

డిసెంబర్ 9వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే బీఎసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో  ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Latest Videos

undefined

రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలను సిద్దం చేసుకొంటుంది. ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై ఇప్పటికే వైసీపీ నేతలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వీరిద్దరిపై ఇప్పటికే ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు.

ఈ విషయమై విపక్షాన్ని  ఇరుకున పెట్టే అవకాశం ఉంది. మరో వైపు ప్రధాన ప్రతిపక్షం  టీడీపీ కూడ అధికార పక్షాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అధికార పార్టీ ఇటీవల తీసుకొన్న నిర్ణయాలపై టీడీపీ  అసెంబ్లీ వేదికగా నిలదీయాలని భావిస్తోంది.

ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, రాజధాని, పోలవరం తదితర అంశాలను టీడీపీ లేవనెత్తే అవకాశం ఉంది.ఈ విషయమై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను ఎండగట్టాలని  టీడీపీ భావిస్తోంది. 

అసెంబ్లీ వేదికగా రెండు పార్టీలు తమ వ్యూహలకు పదును పెడుతున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్‌బై  చెబుతానని ప్రకటించారు. జగన్ వెంట నడుస్తానని తేల్చి చెప్పారు.

వల్లభనేని వంశీపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అసెంబ్లీ సమావేశాల్లో వల్లభనేని వంశీ ఏ రకంగా వ్యవహరిస్తారో అనేది కూడ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడ బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడ సాగుతోంది.

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ విషయాన్ని ప్రకటించారు. 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సమయం వచ్చినప్పుడు పార్టీలో చేర్చుకొంటామని  సుజనా చౌదరి ప్రకటించారు.ఈ ప్రకటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

click me!