జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు: ఈసీ స్పష్టీకరణ

By narsimha lode  |  First Published Jan 24, 2024, 8:11 PM IST

జనసేనకు  గాజు గ్లాస్ ను కేటాయించింది ఈసీ.  ఈ మేరకు ఎన్నికల సంఘం నుండి  ఆ పార్టీ సమాచారం అందింది.


అమరావతి: జనసేన పార్టీ గాజు గ్లాస్ ను కేటాయిస్తూ  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు  జనసేనకు  కేంద్ర ఎన్నికల సంఘం  మెయిల్ ద్వారా సమాచారం పంపింది.

Latest Videos

జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను  ఉచిత చిహ్నాల జాబితాలో ఈ ఏడాది మే మాసంలో ఉంచింది  కేంద్ర ఎన్నికల సంఘం.  ఈ విషయమై  జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి గాజు గ్లాసును కేటాయించాలని  అభ్యర్ధించింది. దీంతో జనసేనకు గాజు గ్లాసును కేటాయిస్తున్నట్టుగా ఈసీ  జనసేనకు మెయిల్ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం  పంపిన ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్  సాంబశివప్రతాప్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందించారు.

also read:అయోధ్య సరయు నది ఒడ్డున కుక్క పిల్లతో బాలుడి ఆట: సోషల్ మీడియాలో వీడియో వైరల్

2019లో  జనసేన పార్టీ  పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  జనసేనకు గాజు గ్లాసును కేటాయించింది ఎన్నికల సంఘం.  అయితే ఆ ఎన్నికల్లో  జనసేనకు  ఎనిమిది శాతం ఓట్లు రాలేదు. ఏడు శాతం అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. కానీ రాజోలు అసెంబ్లీ స్థానంలోనే ఆ పార్టీ విజయం సాధించింది.

2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  జనసేనకు  ఎన్నికల సంఘం  గాజు గ్లాసును కేటాయించింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగే అవకాశం ఉంది. దీంతో  ఈ ఎన్నికల్లో  గాజు గ్లాసును కేటాయిస్తూ  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం, జనసేనల మధ్య  పొత్తు కుదిరింది.ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్   2023 సెప్టెంబర్ మాసంలోనే ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోని  175 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో  వైఎస్ఆర్‌సీపీ  సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ మేరకు  ఇప్పటికే  58 ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీ స్థానాల్లో మార్పులు చేసింది.  టిక్కెట్లు దక్కని అసంతృప్తులు  కొందరు పార్టీ మారేందుకు  ప్రయత్నిస్తున్నారు. కొందరు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 

click me!