మార్చి 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఎల్లుండి జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా

Published : Mar 01, 2022, 04:10 PM IST
మార్చి 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఎల్లుండి జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు (Andhra Pradesh Assembly budget session ) ముహుర్తం ఖారారు అయింది. మార్చి 7వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు (Andhra Pradesh Assembly budget session ) ముహుర్తం ఖారారు అయింది. మార్చి 7వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చి 8న ఇటీవల గుండెపోటుతో మరణించిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అసెంబ్లీ సంతాప తీర్మానం చేసి నివాళులర్పించనుంది. మార్చి 11న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

ఎల్లుండి జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా.. 
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 3వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీని వాయిదా వేశారు. మార్చి 7వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మృతిచెందిన మేకపాటి గౌతమ్‌రెడ్డి పెద్దకర్మ దృష్ట్యా కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకన్నారు. మార్చి 7వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై గవర్నర్‌, సీఎం చర్చించారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చి ఆయన అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. 

అలాగే ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్ విభజన ప్రక్రియ గురించి గవర్నర్ బిశ్వ భూషణ్‌కు సీఎం జగన్ వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుండి వినతులను స్వీకరించి ఆమోద యోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఆవిష్కరించనున్నామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్