73 మంది స్మగ్లర్లు అరెస్ట్.. రూ.50 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

By Mahesh RajamoniFirst Published Dec 25, 2022, 5:16 PM IST
Highlights

Seshachalam forest: ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఏపీ టాస్క్ ఫోర్స్ అధికారులు 1,396 ఆపరేషన్లు నిర్వహించారని, కీలక స్మగ్లర్లను అరెస్టు చేశారని, ఐదు నుండి 10 వరకు కూంబింగ్ బృందాలను బలోపేతం చేశారని టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే. చక్రవర్తి చెప్పారు. ఏపీ అడవుల్లోకి స్మగ్లర్ల రాకను నియంత్రించడానికి కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేస్తామని కూడా ఆయన వెల్ల‌డించారు.
 

Red Sandalwood: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శేషాచలం అడవుల్లో 50 మెట్రిక్ టన్నుల విలువైన ఎర్ర‌చంద‌నం దుంగలను స్వాధీనం చేసుకున్నామ‌ని  రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (ఏపీ ఆర్ ఎస్ టీఎఫ్) వెల్ల‌డించింది. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణాను అడ్డుకోవ‌డానికి మెరుగైన చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. దీనిలో భాగంగానే ఈ ఏడాదిలో పెద్ద ఎత్తున ఎర్ర‌చంద‌నం దుంగ‌ల స్మ‌గ్ల‌ర్ల‌ను అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెడ్‌సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఎఎస్‌టిఎఫ్) శేషాచలం అడవుల్లో ఏడాది కాలంలో (2022) జరిపిన సోదాల్లో 50 కోట్లకు పైగా విలువైన 50 మెట్రిక్ టన్నుల ఎర్ర‌చంద‌నం దుంగలను స్వాధీనం చేసుకుంది. 2016 నుండి పరారీలో ఉన్న 73 వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసింది. టాస్క్‌ఫోర్స్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్ కే. చక్రవర్తి మాట్లాడుతూ.. ఎర్రచందనం స్మగ్లర్‌లను అడవుల నుంచి తరిమివేస్తున్నామ‌ని తెలిపారు. తమిళనాడు స్మగ్లర్లకు వ్యతిరేకంగా పెండింగ్ లో ఉన్న 20 ఎన్బీడబ్ల్యూల‌ను అమలు చేశార‌ని తెలిపారు.

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ కు అడ్డుక‌ట్ట వేయ‌డినికి ఏపీ టాస్క్ ఫోర్స్  అధికారులు 1,396 ఆపరేషన్లు నిర్వహించారని, కీలక స్మగ్లర్లను అరెస్టు చేశారని, ఐదు నుండి 10 వరకు కూంబింగ్ బృందాలను బలోపేతం చేశారని టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే. చక్రవర్తి చెప్పారు. ఏపీ అడవుల్లోకి స్మగ్లర్ల రాకను నియంత్రించడానికి కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేస్తామని కూడా ఆయన వెల్ల‌డించారు.

స్మగ్లర్లను ప‌ట్టుకునేందుకు త్వరలో స్నిఫర్ డాగ్ స్క్వాడ్ ను సైతం నియమిస్తామని చక్రవర్తి తెలిపారు. 'కోవిడ్ -19 కారణంగా డాగ్ స్క్వాడ్ సేవలను నిలిపివేశారు. దీన్ని 2023లో పునఃప్రారంభిస్తాం' అని పేర్కొన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు, స్వాధీనం చేసుకున్న కేసుల్లో కొత్తగా ఏర్పాటైన రెండు కోర్టుల నుంచి శిక్షలు పొందే పనిలో ఉన్నామని చెప్పారు. రెడ్ శాండర్స్ కోర్ డివిజన్లలో ఐశాట్ ఫోన్లు, సీసీటీవీ కెమెరాల వాడకాన్ని పెంచుతామని చెప్పారు.

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ కు సంబంధించి 2022లో 106 కేసులు నమోదుకాగా, 2021లో 180 కేసులు నమోదయ్యాయి. కనీసం 281మంది కలప పనివారు, తాపీ మేస్త్రీలు, స్మగ్లర్లను అరెస్టు చేశారు. అలాగే, అక్ర‌మంగా ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను త‌ర‌లించ‌డానికి ఉప‌యోగిస్తున్న వాహ‌నాలు సైతం భారీగానే స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 70, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 197, కర్ణాటకకు చెందిన ఐదు వాహ‌నాల‌తో పాటు గ‌ర్తింపు ప‌త్రాలు స‌రిగ్గాలేని మ‌రో 50 వాహనాలను సైతం సీజ్ చేశారు.

అంతకుముందు అక్టోబర్‌లో చిత్తూరు పోలీసులు రూ.1.2 కోట్ల విలువైన 122 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోగా, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. 2 టన్నుల బరువున్న ఎర్ర‌చంద‌నం దుంగలతో పాటు రూ. 30 లక్షల విలువైన ఐషర్ లారీ, రెండు కార్లు, ద్విచక్రవాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో విచ్చలవిడిగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు అధికారులు తెలిపారు.

click me!