అన్నవరంలో విషాదం: అక్కా, తమ్ముడు సూసైడ్

Published : Dec 25, 2022, 05:13 PM ISTUpdated : Dec 25, 2022, 05:14 PM IST
అన్నవరంలో  విషాదం: అక్కా, తమ్ముడు సూసైడ్

సారాంశం

కాకినాడ జిల్లాలోని అన్నవరంలో ఇవాళ  అక్కా శ్రీదేవి ఆమె తమ్ముడు శివసత్యలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.  ఆర్ధిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణంగా స్థానికులు  చెబుతున్నారు

కాకినాడ: కాకినాడ జిల్లాలోని అన్నవరంలో  ఆదివారం నాడు అక్కా  తమ్ముడు  ఆత్మహత్య చేసుకున్నారు.  దీంతో  కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీరిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  ఇంట్లోని  గదిలో  అక్కా తమ్ముడు  ఉరేసుకొని  ఆత్మహత్య చేసుకున్నారు.మృతులను   శ్రీదేవి,  శివసత్యగా గుర్తించారు.  ఆర్ధిక ఇబ్బందులే కారణంగా  చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి  అందిన ఫిర్యాదు మేరుకు  పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో  అనేక కారణాలతో  పలువురు ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న కేసులు  నమోదౌతున్నాయి.  ప్రతి రోజూ ఏదో ఒక చోట  ఈ రకమైన కేసులు నమోదౌతున్నాయి.  ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని, ఆర్ధిక ఇబ్బందులుు, కుటుంబ కలహాలతో  పాటు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్యలు  చేసుకుంటున్న ఘటనలు  నమోదౌతున్నాయి. 

కొడుకు  విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నాడని  మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో ఈ నెల  22న జరిగింది.విదేశాలకు  వెళ్లేందుకు  కొడుకు  సదాశివరెడ్డి  నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఇస్టం లేని  ఆయన తల్లి  ఆత్మహత్యచేసుకుంది.  ఈనెల 22న ఏపీలోని యానాంలో  భార్య  అనుమానాస్పదస్థితిలో మరణించడంతో ఆమె భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గోకవరం మండలం లక్ష్మీభవానికి యానాం పట్టణానికి చెందిన  వరప్రసాద్  కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య  మనస్పర్థలు వచ్చాయి.  దీంతో  లక్ష్మీ భవాని ఆత్మహత్య చేసుకుంది.  ఈ విషయం తెలుసుకున్న భర్త వరప్రసాద్  నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.బాసర ట్రిపుల్ ఐటీలో  పీయూసీ  2 తరగతి చదివే విద్యార్ధి బాను ప్రసాద్ ఈ నెల  19న ఆత్మహత్య చేసుకున్నాడు.హస్టల్ గదిలోనే ఫ్యాన్ కు  ఉరేసుకొని  భాను ప్రసాద్ సూసైడ్ చేసుకున్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే