డిప్యూటీ సీఎం ఇంట చిన్నారి వైఎస్... జగన్, భారతి కూడా

Arun Kumar P   | Asianet News
Published : Feb 28, 2021, 07:37 AM ISTUpdated : Feb 28, 2021, 07:54 AM IST
డిప్యూటీ సీఎం ఇంట చిన్నారి వైఎస్... జగన్, భారతి కూడా

సారాంశం

శత్రుచర్ల వారింట ఇటీవలే అడుగుపెట్టిన చిన్నారికి తాజాగా నామకరణ మహోత్సవం జరిగింది. 

విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ఫశ్రీవాణి వైఎస్ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శత్రుచర్ల వారింట చిన్నారి నామకరణ మహోత్సవం జరిగింది.  తమ సీఎం వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతి పేర్లు కలిసివచ్చేలా ''యశ్విత శ్రీజగతి'' అని పేరు పెట్టారు. 

వైసిపి అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు- మంత్రి పుష్ఫశ్రీవాణి దంపతుల కూతురి నామకరణ మహోత్సవం విజయనగరం జిల్లాలోని వారి స్వగ్రామం చినమేరంగిలోని స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. తమ కుమార్తెకు యశ్వితలో మొదటి అక్షరం వై, శ్రీలో మొదటి అక్షరం ఎస్‌ కలిపితే వైఎస్‌ అని, తమ నాయకుడు జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిపి జగతి అని నామకరణం చేశామని పుష్పశ్రీవాణి దంపతులు వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం