అనుకూలంగా లేదు: రాజీనామాకే జేసీ మొగ్గు?

First Published Jul 23, 2018, 2:49 PM IST
Highlights

రాజకీయ వాతావరణం అనుకూలంగా లేదన్నాను.. ఆ మాటకే కట్టుబడి ఉన్నానని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.  తాను ఎవరిమీద అలగలేదన్నారు. . అలిగితే పనులు కావన్నారు.  తాను అలగడానికి పార్లమెంట్‌కు వెళ్లకపోనని చెప్పడానికి  సంబంధం లేదన్నారు.
 

అమరావతి: రాజకీయ వాతావరణం అనుకూలంగా లేదన్నాను.. ఆ మాటకే కట్టుబడి ఉన్నానని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.  తాను ఎవరిమీద అలగలేదన్నారు. అలిగితే పనులు కావన్నారు.  తాను అలగడానికి పార్లమెంట్‌కు వెళ్లకపోనని చెప్పడానికి  సంబంధం లేదన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశం తర్వాత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  సోమవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఇవాళ సచివాలయంలో జేసీ దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు.

దేశంలో ఎవరిమీద అలగలేమన్నారు.  అలిగితే ప్రయోజనం కూడ ఉండదన్నారు.  తాను అలగడానికి... పార్లమెంట్‌కు వెళ్లనని చెప్పడానికి సంబంధం లేదన్నారు.అయితే జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబునాయుడుతో కలిసి వచ్చిన తర్వాత నర్మగర్భంగానే వ్యాఖ్యలు చేశారు. తన మనసులోని మాటలను కుండబద్దలు కొట్టే జేసీ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.

 రాజకీయ వాతావరణం అనుకూలంగా లేదని జేసీ చెప్పడం వెనుక ఆంతర్యం రాజీనామాకు మొగ్గు చూపుతున్నారని సంకేతాలు ఇచ్చారా.... లేదా  ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని జేసీ ఈ వ్యాఖ్యలు చేశారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అయితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జేసీ దివాకర్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.  తన రాజకీయ వారసుడిగా వచ్చే ఎన్నికల్లో జేసీ పవన్ కుమార్ రెడ్డిని బరిలొకి దించాలని భావిస్తున్నారు.  ఈ తరుణంలో  అనంతపురం జిల్లా రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని జేసీ దివాకర్ రెడ్డి  ఎంపీ పదవికి కూడ రాజీనామా చేస్తానని ప్రకటించడం టీడీపీకి కొంత ఇబ్బందిగా మారింది.

రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండకూడదని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మోడీ ఉన్నంత కాలం పోరాటం చేయాల్సిందేనన్నారు. ప్రత్యేక హోదాపై సీడబ్ల్యూసీ ప్రత్యేక తీర్మానం చేయలేదన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

 

click me!