కరోనాతో అనంత సీఐ మృతి: సహచరుడి మరణంతో ఎంపీ గోరంట్ల మాధవ్ దిగ్భ్రాంతి

By Siva KodatiFirst Published Jul 14, 2020, 8:48 PM IST
Highlights

అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనాతో కన్నుమూశారు. కోవిడ్ లక్షణాలతో అనంతపురంలోని స్థానిక సవేరా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజురోజుకు మరణాలు పెరుగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో కరోనా బారినపడి దాదాపు 80 మంది మృతి చెందడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ 19 నుంచి ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున్న వైద్యులు, పోలీస్ సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.

ఈ క్రమంలో అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనాతో కన్నుమూశారు. కోవిడ్ లక్షణాలతో అనంతపురంలోని స్థానిక సవేరా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

Also Read:ఏపీలో కరోనా మృత్యుఘోష: ఒక్క రోజులో 43 మంది మృతి, 1916 కేసులు

మరోవైపు సీఐ రాజశేఖర్ మృతితో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని మాధవ్ ప్రశంసించారు.

సీఐ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. కాగా అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 185 మంది పాజిటివ్‌గా తేలగా, 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 3,651కి చేరింది. వీటిలో 1,456 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనంతపురం జిల్లాలో వైరస్ కారణంగా 40 మంది చనిపోయారు.

click me!