నాటుబాంబులతో హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు..

By AN TeluguFirst Published Jan 20, 2021, 9:22 AM IST
Highlights

అనంతపురంలో నాటుబాంబులతో ప్రతీకార హత్యలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సత్యఏసుబాబు వివరాలు వెల్లడించారు. 

అనంతపురంలో నాటుబాంబులతో ప్రతీకార హత్యలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సత్యఏసుబాబు వివరాలు వెల్లడించారు. 

కనగానపల్లి మండలం వారాదికొట్టాలకు చెందిన ఈ. గోపాల్ వివాహేతర సంబంధం కారణంగా 2010లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇ. చంద్రశేఖర్, ఇ. గంగాధర్ తో పాటు మరి కొందరు నింితులుగా ఉన్నారు. ఆ తర్వాత 2019లో కంబదూరు మండలం రాళ్ల అనంతపురం సమీపంలో మందుపాతర పేల్చి ఇ. దుర్గప్పను హత్య చేశారు. 

దుర్గప్ప ప్రస్తుతం అరెస్టైన రాజశేఖర్, రామచంద్రకు సమీప బంధువు. గోపాల్, దుర్గప్పను హతమార్చిన నిందితులు చంద్రశేఖర్, గంగాధర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని లేదంటే తమకు ప్రాణహాని తప్పదని భావించారు. ఇందులో రాజశేఖర్ తల్లి ముత్యాలమ్మ ప్రోద్భలం కూడా ఉంది. 

రాజశేఖర్, రామచంద్ర కలిసి హత్యకు ప్లాన్ చేశారు. చంద్రశేఖర్, గంగాధర్ ను చంపాలని కనగానపల్లి మండలం వేపకుంటకు చెందిన హరితో చర్చించారు. జిల్లా కేంద్రంలో ఉంటున్న సిండికేట్ నగర్ కు చెందిన నగేష్, పాపంపేటకు చెందిన నగేష్ తో నాటు బాంబుల తయారీ కోసం ముడి సరుకు సమకూర్చుకున్నారు. తిప్పేపల్లి శివారులోని లింగరాజు తోటలో నాటు బాంబులు తయారు చేయించారు.

ఈ క్రమంలో పోలీసులకు సమాచారం రావడంతో అనంతరపురం సీపీఎస్ డీఎస్పీ మహబూబ్ భాషా, కళ్యాణదుర్గం సీఐ శివశంకర్ నాయక్, కంబదూరు ఎస్పై రాజేష్ ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆరుగురు నిందితులను తిప్పేపల్లి గ్రామ శివారులో నిందితులను పట్టుకుని, కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అప్పమత్తంగా వ్యవహరించి, సమర్థంగా పనిచేసిన అధికారులను ఎస్పీ సత్యఏసుబాబు ప్రశంసించారు. 

click me!