అనంతపురం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 09, 2024, 07:57 PM ISTUpdated : Mar 09, 2024, 07:58 PM IST
అనంతపురం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

అనంతపురంలో ఫ్యాక్షనే కాదు ఈ ప్రాంతంలో అమూల్యమైన చారిత్రక సంపద, ఆధ్యాత్మికత వుంది. ఇక దేశానికి ఉద్ధండులైన రాజకీయ నేతలను అందించింది అనంతపురం. కర్ణాటక సరిహద్దు కావడంతో అక్కడి సంస్కృతి ఈ ప్రాంతంలో కలగలిసిపోయింది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానాలున్నాయి. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా వున్న అనంతపురం.. తర్వాత టీడీపీ చేతుల్లోకి వెళ్లింది. తెలుగుదేశం కంచుకోటను సొంతం చేసుకున్న వైసీపీ మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. సిట్టింగ్ ఎంపీ తలారి రంగయ్యను జగన్ కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈయన ప్లేస్‌లో పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను జగన్ నియమించారు.

అనంతపురం.. ఈ పేరు వినగానే ఫ్యాక్షన్ రాజకీయాలు మదిలో మెదులుతాయి. ఆధిపత్యం, ఉనికి, ప్రతీకారం ఇలా దశాబ్ధాలుగా ఒకరినొకరు చంపుకుంటూ అనంత చరిత్రను రక్తాక్షరాలతో లిఖించారు. ఫ్యాక్షన్‌కు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల అండ దొరకడంతో ఇక్కడ రక్తం ఏరులై పారింది. ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో హత్యల పరంపర కొనసాగింది. ఫ్యాక్షన్ రక్కసికి వందలాది కుటుంబాలు బలయ్యాయి. కానీ అనంతపురంలో ఫ్యాక్షనే కాదు ఈ ప్రాంతంలో అమూల్యమైన చారిత్రక సంపద, ఆధ్యాత్మికత వుంది. ఇక దేశానికి ఉద్ధండులైన రాజకీయ నేతలను అందించింది అనంతపురం. కర్ణాటక సరిహద్దు కావడంతో అక్కడి సంస్కృతి ఈ ప్రాంతంలో కలగలిసిపోయింది. 

అనంతపురం ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ కంచుకోటలో వైసీపీ పాగా :

అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానాలున్నాయి. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా వున్న అనంతపురం.. తర్వాత టీడీపీ చేతుల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ 12 సార్లు, టీడీపీ మూడు సార్లు , వైసీపీ, సీపీఐ ఒక్కోసారి విజయం సాధించింది. ఈ లోక్‌సభ పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య 16,64,160 మంది. వీరిలో పురుషుల సంఖ్య 8,31,416 మంది... మహిళా ఓటర్ల సంఖ్య 8,32,562 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 80.66 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉరవకొండ తప్పించి మిగిలిన ఆరు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి తలారి రంగయ్యకు 6,95,208 ఓట్లు.. జేసీ పవన్ కుమార్ రెడ్డి 5,53,780 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 1,41,428 ఓట్ల మెజారిటీతో అనంతపురాన్ని కైవసం చేసుకుంది. 

అనంతపురం ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :

తెలుగుదేశం కంచుకోటను సొంతం చేసుకున్న వైసీపీ మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. సిట్టింగ్ ఎంపీ తలారి రంగయ్యను జగన్ కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈయన ప్లేస్‌లో పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను జగన్ నియమించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన నారాయణను ఇక్కడ ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. అనంత లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వాల్మికీ సామాజికవర్గం అధికంగా వుంటుంది. అలాంటి చోట కురుబ నేతను ఎంపిక చేయడం వెనుక జగన్ వ్యూహం ఏంటన్నది అంతుచిక్కకుండా వుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే .. కాలువ శ్రీనివాసులు, బీకే పార్థసారథిల్లో ఒకరికి టికెట్ ఖరారయ్యే అవకాశం వుందని భావిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్