సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్

Siva Kodati |  
Published : Jan 22, 2021, 03:46 PM IST
సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్

సారాంశం

జిల్లా కలెక్టర్ అంటే జిల్లాకి మకుటం లేని మహారాజు. ఆయన మాటే శాసనం. కలెక్టర్ వస్తున్నారంటేనే ఆయన వెనుక మందీమార్భలం ఆ హంగామా మామూలుగా ఉండదు. అలాంటి వ్యక్తి సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.

జిల్లా కలెక్టర్ అంటే జిల్లాకి మకుటం లేని మహారాజు. ఆయన మాటే శాసనం. కలెక్టర్ వస్తున్నారంటేనే ఆయన వెనుక మందీమార్భలం ఆ హంగామా మామూలుగా ఉండదు. అలాంటి వ్యక్తి సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గొంచిరెడ్డిపల్లి గ్రామం నుంచి మండల కేంద్రంమైన బ్రహ్మసముద్రం వరకు కలెక్టర్ బస్సులోనే వెళ్లారు.

గ్రామం నుంచి మండల కేంద్రంలో ఉన్న పాఠశాల వరకు వెళ్లేందుకు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకున్నారు.

దీనిపై స్పందించిన కలెక్టర్‌ వెంటనే బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గొంచిరెడ్డిపల్లిలో బస్సును ప్రారంభించిన ఆయన‌.. అందులోనే ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్