ఆనందయ్య మందుల వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని తేలిందన్నారు. మొదటి దశలో 22 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు అందిస్తున్నామన్నారు.
ఆనందయ్య మందు ఫ్రంట్ లైన్ వర్కర్లకు పంపిణీ చేశారు. విశాఖపట్నంలోని కొందరు ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ మందు పంపిణీ చేశారు. విశాఖ వైసీపీ ఆఫీసులోని వర్కర్లకు ఎంపీ విజయసాయి రెడ్డి చేతుల మీదగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ 22 వేలమంది ప్రాణాలకు తెగించి విశాఖలో పని చేశారన్నారు. ఆనందయ్య మందుల వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని తేలిందన్నారు. మొదటి దశలో 22 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు అందిస్తున్నామన్నారు.
రెండవ విడతలో జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఆనందయ్య మందు అందిస్తామన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కరోనా నియంత్రణ చర్యలు సీఎం జగన్ చేపట్టారు.
ఇదిలా ఉండగా... కృష్ణపట్నంలో ఆనందయ్య మందు ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆనందయ్య మందు కోసం ఇతర జిల్లాలల నుంచి కూడా జనం క్యూలు కట్టారు. తీరా విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. దాని మీద ప్రయోగాలు చేసి.. చివరకు మందు కు ఒకే చెప్పారు. ఇప్పుడు మందు పంపిణీ సవ్యంగా జరుగుతోంది.