
ఇలాంటి మహానాడులు పెట్టుకుని మనకు మనమే భజన చేసుకుంటూ పోతే సరిపోతుందా..’ అని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కార్యకర్తలకు సపోర్టుగా నిలబడినపుడే విజయం వరిస్తుందన్నారు. ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై 80 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. నెల్లూరులో వ్యవసాయ శాఖ మంత్రి సోమిశెట్టి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నా.. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. రైతులు చాలా బాధలో ఉన్నారు. వారు తిరుగుబాటు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి..’ అని ఆనం అన్నారు. ఎన్నో సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పుకున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎనాడూ ఇన్ని అవమనాలు పడలేదని ఆనం ఆవేదనం వ్యక్తం చేశారు.