చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

By Nagaraju penumalaFirst Published Feb 14, 2019, 10:07 AM IST
Highlights

ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కూడా సమాచారం. ఇకపోతే అటు విశాఖపట్నంలోని ఆయన నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాలను సైతం తొలగించినట్లు సమాచారం. ఇకపోతే ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను సైతం వెనక్కి పంపించినట్లు సమాచారం. అవంతి శ్రీనివాస్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. 
 

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. 

గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో ఇక వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. 

ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత నుంచి అంటే బుధవారం సాయంత్రం నుంచి కూడా అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నేతలకు టచ్ లో లేకుండా పోయారని తెలుస్తోంది. 

ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కూడా సమాచారం. ఇకపోతే అటు విశాఖపట్నంలోని ఆయన నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాలను సైతం తొలగించినట్లు సమాచారం. ఇకపోతే ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను సైతం వెనక్కి పంపించినట్లు సమాచారం. అవంతి శ్రీనివాస్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. 

గతంలో తన మనసులో మాటను టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చినట్లు సమాచారం. అయితే అప్పట్లో టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదని మళ్లీ ఎంపీగానే పోటీ చెయ్యాలని సూచించినట్లు తెలుస్తోంది. 

భీమిలి టికెట్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో 2009లో  పీఆర్పీ తరుపున అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

అప్పటి నుంచి భీమిలి నియోజకవర్గంపై పట్టు సాధించుకున్నారు. 2014 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావించారు. అయితే చంద్రబాబు నాయుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చెయ్యాలని ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భీమిలి టికెట్ పై హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

అందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలుస్తోంది. జగన్ ను కలిసిన తర్వాత అవంతి శ్రీనివాస్ తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చెయ్యనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది అన్న అంశాలపై జగన్ తో అవంతి శ్రీనివాస్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

ఈనెల 24న విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ సమర శంఖారావం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో అవంతి శ్రీనివాస్ అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సన్నిహితులు చెప్తున్నారు. సాయంత్రం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తోపాటు ఇతర జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ కీలక నేతలు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 

click me!