దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారు.. చంద్రబాబు

Published : Feb 14, 2019, 10:04 AM IST
దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారు.. చంద్రబాబు

సారాంశం

తనను దొంగ దెబ్బ తీయాలని కొందరు చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 

తనను దొంగ దెబ్బ తీయాలని కొందరు చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తాను రాష్ట్రం కోసం పోరాడుతున్నానని..5కోట్ల ప్రజల హక్కుల కోసం ధర్మపోరాటం చేస్తున్నానని చెప్పారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ లు కలిసి తనపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

అవకాశవాదులకు టీడీపీలో స్థానం లేదన్నారు. కొందరు పోతే నష్టాలకన్నా లాభాలే ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తనపై కులముద్ర వేయడం చాలా దారుణమన్నారు. వైసీపీ కులాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం.. మరోవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ మీరిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ నిరంతరంగా శ్రమిస్తున్నామన్నారు.

మోదీ పాలనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.  అన్నదాత సుఖీభవ పథకం ఒక చరిత్ర అని కొణియాడారు. కేంద్రం ఇచ్చిన సాయంలో అనేక ఆంక్షలు విధించిందన్నారు.  ఏపీలో మాత్రం రైతులందరికీ ఇస్తున్నామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్