అమ్మఒడి సొమ్ము రావడం లేదని వెళ్తే.. వేలిముద్ర వేసుకొని డబ్బులు కాజేసిన వాలంటీర్..

By Asianet NewsFirst Published Aug 15, 2023, 7:36 AM IST
Highlights

అమ్మఒడి సొమ్ము రావడం లేదని, దీనిని పరిష్కరించాలని వాలంటర్ దగ్గరికి వెళ్తే.. అతడు ఆ సొమ్మును కాజేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో చోటు చేసుకుంది.

అమ్మఒడి సొమ్ము తన బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు జమకావడం లేదో ఆ తల్లికి అర్థం కాలేదు. వాలంటర్ దగ్గర ఈ విషయాన్ని ఆమె ప్రస్తవించింది. అయితే ఆమెకు రెండేళ్ల నుంచి వేరే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయని అతడు గుర్తించాడు. ఆ తల్లి వేలిముద్రలు తీసుకొని ఆమెకు తెలియకుండా డబ్బులు కాజేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

కూరగాయలు కొనుగోలు చేస్తుండగా తెగిపడ్డ విద్యుత్ తీగ.. వృద్ధురాలి దుర్మరణం..కర్నూలు జిల్లాలో ఘటన

తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను ఆశ్రయించగా.. ఆలస్యంగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం..  కుప్పం మండలం చందం గ్రామంలో రామకృష్ణ-ప్రమీల దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇందులో కూతురు భానుశ్రీ ఇంటర్ చదువుతోంది. ఓ కుమారుడు మహేంద్ర తొమ్మిదో తరగతి, మరో కుమారుడు రాహుల్ ఆరో తరగతి చదువుతున్నాడు.

కాంగ్రెస్ టికెట్లకు దరఖాస్తులు.. ఈ నెల 18 నుంచి 25 వరకు స్వీకరణ

అయితే ఏపీ ప్రభుత్వం వీరికి అందరిలాగే అమ్మ ఒడి సొమ్ము అందజేస్తోంది. మొదటి రెండు సంవత్సరాల పాటు వీరికి సప్తగిరి గ్రామీణ బ్యాంకులో డబ్బులు పడ్డాయి. అయితే గతేడాది, ఈ ఏడాదికి సంబంధించిన డబ్బులు అందులో పడలేదు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన అమ్మఒడి సాయం వీరికి ఇండియన్ బ్యాంకులో ఉన్న మరో అకౌంట్ లో జమ అయ్యింది. ఈ విషయం ఆ కుటుంబానికి తెలియలేదు.
హిమాచల్, ఉత్తరాఖండ్ లలో భారీ వర్షాలు: 50 మంది మృతి, భారీగా ఆస్తి నష్టం

ఆ కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే గ్రామీణ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకొని డబ్బులు పడటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారు ఇటీవల ఈ సమస్యను స్థానిక వాలంటీర్ సురేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు సమస్య అర్థం అయ్యింది. అమ్మఒడి సాయం వారి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతోందని గుర్తించాడు. డబ్బులు కచ్చితంగా వస్తాయని చెబుతూ ప్రమీలను వేలిముద్ర వేయాలని సూచించాడు. దీంతో ఆమె సురేశ్ చెప్పినట్టు చేసింది. తరువాత ఆమె అకౌంట్ లో ఏడాది రూ.10 వేల చొప్పున జమ అయిన.. రెండు సంవత్సరాలకు సంబంధించిన డబ్బులను మళ్లించుకున్నాడు. ఈ విషయం బాధిత కుటుంబం గుర్తించింది. ఈ విషయాన్ని చెప్పేందుకు బాధితురాలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ దగ్గరికి వెళ్లారు. 

click me!