ఏపీలో మావోలకు ఎదురుదెబ్బ: ఆర్కే గన్‌మెన్ సహా ఆరుగురు నక్సల్స్ అరెస్ట్

Published : Aug 12, 2021, 10:49 AM IST
ఏపీలో మావోలకు ఎదురుదెబ్బ: ఆర్కే గన్‌మెన్ సహా ఆరుగురు నక్సల్స్ అరెస్ట్

సారాంశం

ఏవోబీలో ఆరుగురు కీలక మావోయిస్టులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్కే గన్‌మెన్ సహా ఆరుగురు కీలక మావోయిస్టుల అరెస్ట్ విషయాన్ని ఏపీ డీజీపీ గురువారం నాడు మీడియాకు వివరించే అవకాశం ఉంది.

అమరావతి: ఆంద్రా ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఆరుగురు కీలక మావోయిస్టులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్ కూడ ఉన్నారని సమాచారం.అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోము లను హతమార్చిన కేసులో నిందితులుగా ఉన్న మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆరుగురు కీలక మావోయిస్టుల అరెస్ట్ ను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ గురువారం నాడు మీడియాకు వివరించనున్నారు.  ఏవోబీలో ఆరుగురు కీలక మావోయిస్టుల అరెస్ట్ ఆ పార్టీకి తీవ్ర నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?