పవన్ కళ్యాణ్ తో అమెరికన్ కాన్సులేట్ భేటీ

Published : Feb 12, 2019, 09:57 PM IST
పవన్ కళ్యాణ్ తో అమెరికన్ కాన్సులేట్ భేటీ

సారాంశం

అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ భేటీ అయ్యారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. భేటీ అయిన ఆమె పార్టీ కార్యాలయం అంతా కలియతిరిగారు.    

విజయవాడ: అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ బి.హడ్డా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాయలంలో ఆమె జనసేనానితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆమెకు పుష్పగుచ్చంతో పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. 

ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు. ఇప్పటికే కేథరీన్ బి.హడ్డా తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనూ సమావేశమయ్యారు. 

అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ భేటీ అయ్యారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. భేటీ అయిన ఆమె పార్టీ కార్యాలయం అంతా కలియతిరిగారు.  ఈ సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?