వైఎస్సార్ జలకళలో సవరణలు: వీరు అనర్హులు, ఏపీ సర్కార్ ఆదేశాలు

Siva Kodati |  
Published : Dec 14, 2020, 08:03 PM IST
వైఎస్సార్ జలకళలో సవరణలు: వీరు అనర్హులు, ఏపీ సర్కార్ ఆదేశాలు

సారాంశం

వైఎస్సార్ జలకళ పథకానికి సవరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనిచేయని బోర్లున్న రైతులకూ వైఎస్సార్ జలకళ పథకం వర్తింపజేస్తున్నట్లు తెలిపింది

వైఎస్సార్ జలకళ పథకానికి సవరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనిచేయని బోర్లున్న రైతులకూ వైఎస్సార్ జలకళ పథకం వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.

సర్వీసులో వున్న, పదవి విరమణ చేసిన ఉద్యోగులు అనర్హులని పేర్కొంది. రెండున్నర ఎకరాల భూమి వున్న రైతు గ్రూపులకూ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది.

రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే వైఎస్సార్ జలకళ వర్తిస్తుందని వెల్లడించింది. పొలంలో మొదటి బోరు విఫలమైతే హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్ సర్వే చేయాలని ఆదేశించింది. సర్వేలో నీటి లభ్యత నిర్థారణ అయ్యాకే రెండో బోరు వేసేలా నిబంధనలు రూపొందించింది. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu