అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం: బెడ్స్ ఖాళీ లేవని కరోనా రోగిని రోడ్డుపై పడేశారు

By Siva KodatiFirst Published Apr 27, 2021, 8:40 PM IST
Highlights

విశాఖ కేజీహెచ్‌లో మరోసారి మానవత్వం మంటగలిసింది. ఆసుపత్రి ఆవరణలో సీఎస్ఆర్ బ్లాక్ వద్ద కరోనా రోగికి బెడ్ లేదంటూ రోడ్డు మీదే సిబ్బంది వదిలివేశారు. 108లో కంచరపాలెం నుంచి సీఎస్ఆర్ బ్లాక్‌కు 56 ఏళ్ల మహిళను తీసుకొచ్చారు కుటుంబసభ్యులు.

ఆసుపత్రికి తీసుకొచ్చేశామని..రోగిని దించేసి వెళ్లిపోయింది. అయితే బెడ్స్ ఖాళీ లేవంటూ ఆమెను రోడ్డు మీదే వదిలేశారు. కుటుంబీకుల ఆర్తనాదాలను ఆసుపత్రి యజమాన్యాలు పట్టించుకోలేదు. ఆసుపత్రుల్లో చేర్చుకోవాలంటూ ఎంత వేడుకున్నప్పటికీ వారిని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అందరినీ కలిచి వేస్తున్నాయి. 

Also Read:ఏడాదిన్నర చిన్నారికి కరోనా... వైద్యం అందక అంబులెన్స్ లోనే మృతి

దీనికి కొద్దిసేపటి క్రితమే అదే కేజీహెచ్ వద్ద హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. కరోనాతో ఏడాదిన్నర పాప ప్రాణాలు కోల్పోయింది. అచ్యుతాపురంకు చెందిన ఈ పాపకు కరోనాగా తేలింది. మంగళవారం చిన్నారి పరిస్ధితి విషమంగా వుండటంతో తల్లిదంద్రులు కేజీహెచ్‌కు తరలించారు.

అయితే బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో చేర్చుకోలేమని సిబ్బంది చెప్పారు. దీంతో పాపను గంట పాటు అంబులెన్స్‌లో వుంచి ఆక్సిజన్ అందజేశారు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో చిన్నారి అంబులెన్స్‌లో కన్నుమూసింది
 
click me!