అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కరోనా కలకలం: ఫీవర్ సర్వే చేపట్టిన వైద్య సిబ్బంది

By narsimha lode  |  First Published Apr 18, 2023, 1:10 PM IST

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో  కరోనా కేసులు  పెరుగుతున్నాయి.     దీంతో  జిల్లాలో  ఫీవర్ సర్వేను  వైద్య ఆరోగ్య  శాఖ  చేపట్టింది.  కరోనా కేసుల  నమోదుపై  వైద్య ఆరోగ్య  శాఖ  ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. 


కాకినాడ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో  కరోనా  కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి.   రోజురోజుకి  కరోనా  కేసులు  పెరిగిపోవడంపై  వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.  ఇప్పటికే  జిల్లాలో  47  కరోనా  కేసులు నమోదయ్యాయి.  మరో వైపు  పి.గన్నవరం  పీహెచ్ సీ లో  ఐదుగురికి కరోనా  సోకింది.  ఇదిలా ఉంటే  కాకినాడ  జీజీహెచ్  లో  ఇద్దరు మృతి చెందారు. ఈ ఇద్దరి మృతికి  కరోనా  కారణమనే ప్రచారం  సాగుతుంది.  ఈ విషయమై  ఏపీ వైద్య  ఆరోగ్య  శాఖ  కమిషనర్  స్పందించారు. కాకినాడ  జీజీహెచ్ ఆసుపత్రిలో ఇద్దరి మృతిపై  విచారణకు  ఆదేశించారు  వైద్య ఆరోగ్య కమిషనర్. . 

జిల్లాలో  కరోనా  కేసుల పెరుగుదలకు కారణాలపై  వైద్య ఆరోగ్య  శాఖ  కారణాలు  అన్వేషిస్తుంది.  మరో వైపు  జిల్లాలో  ఫీవర్ సర్వేను  వైద్య ఆరోగ్య శాఖ  చేపట్టింది.  రాష్ట్రంలో  కరోనా  టెస్టులను  పెంచినట్టుగా  ఏపీ ప్రభుత్వం  ప్రకటించింద. 

Latest Videos

దేశంలోని  పలు  రాష్ట్రాల్లో  కరోనా  కేసులు పెరుగుతున్నాయి.  ఇవాళ  దేశంలో  7633 కరోనా కేసులు నమోదయ్యాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  రాష్ట్రాలకు   కేంద్ర ప్రభుత్వం  మార్గదర్శకాలను  జారీ  చేసింది.  కొన్ని రాష్ట్రాల్లో మాస్కులను తప్పనిసరి  చేశారు.

tags
click me!