ముగ్గురు, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మా వైపు చూస్తుండొచ్చు: అంబటి

By narsimha lodeFirst Published Jun 13, 2019, 3:33 PM IST
Highlights

టీడీపీకి చెందిన ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలు మా పార్టీ వైపు చూస్తే చూడొచ్చు... అలా చూడకపోతే గౌరవిస్తాం... కానీ, తమ పార్టీలో చేరాలంటే టీడీపీ ద్వారా లభించిన పదవులకు రాజీనామాలు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. 

అమరావతి:  టీడీపీకి చెందిన ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలు మా పార్టీ వైపు చూస్తే చూడొచ్చు... అలా చూడకపోతే గౌరవిస్తాం... కానీ, తమ పార్టీలో చేరాలంటే టీడీపీ ద్వారా లభించిన పదవులకు రాజీనామాలు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. 

ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సమయంలో ఆయనను అభినందిస్తూ అంబటి రాంబాబు మాట్లాడారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు లేదా నలుగురు. ఎమ్మెల్యేలు మా వైపు చూస్తే చూడొచ్చు...చూడకపోతే మరీ మంచిదే... పార్టీ మారమని చెబితే గౌరవిస్తామన్నారు. 

టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే వచ్చే అసెంబ్లీలో కేవలం ముగ్గురికే ఆ పార్టీ పరిమితమయ్యే అవకాశం ఉందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 

అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తికి స్పీకర్ పదవిని ఇచ్చిన పార్టీ తమదని ఆయన గుర్తు చేశారు. గత ఐదేళ్లలో టీడీపీ అన్ని వ్యవస్థలను కుప్పకూల్చిందని రాంబాబు  విమర్శించారు.
 

click me!