బిజెపి మహాకుట్రలో భాగమే జగన్‌తో రమణ దీక్షితులు భేటీ: బొండా ఉమ

Published : Jun 07, 2018, 05:40 PM IST
బిజెపి మహాకుట్రలో భాగమే జగన్‌తో రమణ దీక్షితులు భేటీ: బొండా ఉమ

సారాంశం

రమణ దీక్షితులుపై నిప్పులు చెరిగిన బొండా ఉమ

విజయవాడ: బిజెపి మహా కుట్రలో   టిటిడి  మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు  
భాగస్వామ్యమయ్యారని  టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు.

గురువారం సాయంత్రం హైద్రాబాద్ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తో మాజీ
టిటిడి ప్రధాన అర్చకులు సమావేశం కావడంపై టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్
రావు స్పందించారు. 


30 ఏళ్ళ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు రాజకీయాల కోసం స్వామివారిని
వాడుకొంటున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకుల చేతుల్లో రమణ
దీక్షితులు పావుగా మారారని ఆయన ఆరోపించారు. 

ఏ ఉద్దేశ్యంతో అమిత్ షా ను రమణ దీక్షితులు కలిశారో చెప్పాలని ఆయన డిమాండ్
చేశారు. తిరుమల వెళ్ళినప్పుడు చాలాసార్లు చంద్రబాబునాయుడు రమణ దీక్షితులను
కలిశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ ను రమణ
దీక్షితులు కోరారని చెప్పడం అవాస్తవమని ఆయన అభిప్రాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు