బాబు కోసమే లోక్ సత్తాకు కొత్త డ్రైవర్ జేడీ: అంబటి

By Nagaraju TFirst Published Nov 26, 2018, 5:55 PM IST
Highlights

లోక్ సత్తా పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. లోక్ సత్తా పార్టీ పాతపార్టీ అయినా కొత్త డ్రైవర్ జేడీ లక్ష్మీనారాయణ అంటూ ఎద్దేవా చేశారు. లోక్ సత్తా పార్టీ జెండా పైకి నీలం రంగులో ఉన్నా లోపల అంతా పసుపుమయం అని ధ్వజమెత్తారు. 

విజయవాడ: లోక్ సత్తా పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. లోక్ సత్తా పార్టీ పాతపార్టీ అయినా కొత్త డ్రైవర్ జేడీ లక్ష్మీనారాయణ అంటూ ఎద్దేవా చేశారు. లోక్ సత్తా పార్టీ జెండా పైకి నీలం రంగులో ఉన్నా లోపల అంతా పసుపుమయం అని ధ్వజమెత్తారు. 

లోక్ సత్తా పార్టీ చంద్రబాబు పాలన కాలంలో ఏనాడు ప్రశ్నించలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడు మాత్రమ ఈ బండి బయటకు వస్తుందన్నారు. ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కానీ, అవినీతికి పాల్పడినప్పుడు కానీ లోక్ సత్తా ప్రశ్నించలేదని విమర్శించారు. 

మరోవైపు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి ధ్వజమెత్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుసుకుని చంద్రబాబు ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. 

రెండు, మూడు నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందావ అంటూ నిలదీశారు. ఎందుకు ఈ ఆర్భాటం అంటూ నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబుకు ప్రేమ లేదని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేసి నీరు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పిన చంద్రబాబు ఇంకా ఎందుకు పూర్తి చెయ్యలేదన్నారు. ప్రాజెక్టు పూర్తిచెయ్యకపోగా పోలవరం వద్దకు జనాన్ని బస్ లలో ట్రాక్టర్లలో పంపి ఏదో బ్రహ్మాండం జరిగిపోతుందని కలర్ ఇస్తున్నారని విమర్శించారు.  

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్రద్ధ పెట్టడం లేదని అదేమని ప్రశ్నిస్తే కేంద్రం సహకరించడం లేదని కుంటి సాకులు చెప్తున్నారని విమర్శించారు. పట్టి సీమ నుంచి రాయల సీమకు నీరుస్తామని చెప్పి అనువణువునా దోచుకున్నారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో రాష్ర్టంలో సాగునీటి విస్తిర్ణంతగ్గిందని సర్వేలు చెప్తున్నాయని అంబటి తెలిపారు. 

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నిరుద్యోగ భృతి, అన్న క్యాంటిన్లు, ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్ గా అంబటి అభివర్ణించారు. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు ఇవన్నీ గుర్తుకువస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలిపారు. 

click me!