మే 23న పదవిచ్యితుడు కావడం ఖాయం: చంద్రబాబుపై అంబటి ఫైర్

Published : May 06, 2019, 04:49 PM IST
మే 23న పదవిచ్యితుడు కావడం ఖాయం: చంద్రబాబుపై అంబటి ఫైర్

సారాంశం

తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని చంద్రబాబు భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఓటమిని అంగీకరించలేక వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. 

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఈనెల 23న పదవీచిత్యుడు కావడం ఖాయమన్నారు. 

తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని చంద్రబాబు భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఓటమిని అంగీకరించలేక వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. 

ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని ఇలాంటి తరుణంలో ఏపీ కేబినేట్ సమావేశం పెడతానంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు ఏపీ కేబినేట్ తీసుకునే నిర్ణయాలు ఎందుకూ పనికిరావని చంద్రబాబు తెలియదా అంటూ చురకలు వేశారు. గ్రూప్ 2 పరీక్షల్లో టీడీపీ గురించి ప్రశ్నలుండటం సరికాదన్నారు అంబటి రాంబాబు. 
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu