
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ యువ నేత విష్ణువర్థన్ రెడ్డి. చంద్రబాబుకు రాజకీయాల్లో రెండు నాల్కలు ఉన్నాయన్నారు. చంద్రబాబులా బీజేపీ ఎప్పుడూ రెండు నాల్కల ధోరణీతో వ్యవహరించలేదని స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారంతో చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల మధ్య విషయం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ సమక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఎంతో సమర్థవంతంగా జరిగిందని చెప్పిన చంద్రబాబు ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇకపోతే రాజకీయాలను డబ్బు మయం చేసింది చంద్రబాబేనని ఆరోపించారు విష్ణువర్థన్ రెడ్డి. అన్ని పార్టీలు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుంటే చంద్రబాబు మాత్రం డబ్బుతో రాజకీయాలు చేశారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు.