అడ్డదారిలో ఒకే సామాజిక వర్గానికి ప్రమోషన్లు: చంద్రబాబుపై గవర్నర్ కు వైసీపీ లేఖ

Published : May 06, 2019, 04:33 PM ISTUpdated : May 06, 2019, 04:54 PM IST
అడ్డదారిలో ఒకే సామాజిక వర్గానికి  ప్రమోషన్లు:  చంద్రబాబుపై గవర్నర్ కు వైసీపీ లేఖ

సారాంశం

ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి పోలీస్ శాఖలో పదోన్నతులపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. ఒకే సామాజిక వర్గానికి లబ్ధి చేకూరేలా పోలీస్ శాఖలో ప్రమోషన్లు చేపట్టారని దానిపై విచారణకు ఆదేశించాలంటూ లేఖలో కోరారు. 


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో పదోన్నతులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం తీవ్రతరం చేసింది. ప్రమోషన్లపై ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అనంతరం కూడా ప్రమోషన్ల అంశాన్ని వదల్లేదు. 

ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి పోలీస్ శాఖలో పదోన్నతులపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. 

ఒకే సామాజిక వర్గానికి లబ్ధి చేకూరేలా పోలీస్ శాఖలో ప్రమోషన్లు చేపట్టారని దానిపై విచారణకు ఆదేశించాలంటూ లేఖలో కోరారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా చంద్రబాబు ముందస్తు వ్యూహంతోనే 37 మంది డీఎస్పీలకు అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చారంటూ లేఖలో పేర్కొన్నారు. 

చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు ఓ సామాజిక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరేలా ఉన్నాయని వాటిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలంటూ లేఖలో పేర్కొన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu