250 రోజులకి చేరుకొన్న అమరావతి నిరసనలు: వెరైటీ ఆందోళనలు

Published : Aug 23, 2020, 02:00 PM IST
250 రోజులకి చేరుకొన్న అమరావతి నిరసనలు: వెరైటీ ఆందోళనలు

సారాంశం

ఏపీ రాష్ట్ర రాధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిసర గ్రామాలకు చెందిన రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారంనాటికి 250 రోజులకు చేరుకొన్నాయి. 

అమరావతి: ఏపీ రాష్ట్ర రాధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిసర గ్రామాలకు చెందిన రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారంనాటికి 250 రోజులకు చేరుకొన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  మూడు రాజధానులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేసిన రోజు నుండి అమరావతి పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు.

అమరావతి పరిసరాల్లోని  తుళ్లూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉండవల్లి, రాయపూడి తదితర గ్రామాల్లో రైతులు, రైతులు, కూలీలు ఆందోళనలు చేస్తున్నారు.  

మూడు రాజధానులను నిరసిస్తూ రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంతాల రైతులు భూములు ఇచ్చారు.  రాజధాని కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న వారిపై కేసులు కూడ నమోదయ్యాయి.

తమ భూములు కోల్పోవడంతో పాటు అమరావతి నుండి రాజధాని లేకుండా పోయిందనే మనోవేదనతో కొందరు రైతులు మరణించారు.  రాష్ట్ర ప్రభుత్వం తమపై కేసులు బనాయించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వానికి భూములిచ్చి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకొనే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. రాజధాని దీక్షా శిబిరాన్ని లాయర్లు, రైతులు సంఘీభావం తెలిపారు.

ఈ ఆందోళనలు 250 రోజులకు చేరుకోవడంతో జేఏసీ నేతృత్వంలో వినూత్న రీతిలో ఆదివారం నాడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డప్పులు కొట్టి యువత ఇవాళ నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్