పవన్ కి మతిస్థిమితం సరిగాలేదన్న రాజధాని రైతులు

First Published Jul 23, 2018, 11:25 AM IST
Highlights

తాము బలవంతంగా రాజధానికి భూములు ఇచ్చామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను రైతులు తప్పుపట్టారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఊహించిన షాక్ తగిలింది.  తాము బలవంతంగా రాజధానికి భూములు ఇచ్చామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను రైతులు తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రాజధానిలో రైతుల్ని ఎవరూ బలవంతం చేసింది లేదని.. రైతులు ఇష్టపడి 33 వేల ఎకరాలు రాజధాని నిర్మాణ కోసం స్వచ్ఛందంగా ఇచ్చారని రాజధాని రైతు నాయకులు స్పష్టం చేశారు.

ఇటీవల పవన్.. రాజధాని రైతుల గురించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కున్నారంటూ వారు వ్యాఖ్యానించారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై రాజధాని రైతులు స్పందించారు.

హైద్రాబాద్‌లో సినిమాలు తీసుకునే పవన్ కి  రాజధాని నిర్మాణానికి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి ఏం తెలుసుని రైతులు ప్రశ్నించారు. అభివృద్ధి జరుగుతుంటే గజిబిజి చేసి రైతుల ప్లాట్లకు విలువ తగ్గేలా ఎవరు ప్రవర్తించినా రైతుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి సారి ఉద్యమం చేస్తామంటూ పవన్‌ చేస్తున్న వ్యాఖ్యానాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రాజధాని అభివృద్ధి ప్రత్యక్షంగా చూసి వ్యాఖ్యలు చేయాలని హితవు పలికారు. 

click me!