సింగపూర్ కు బయలుదేరిన రాజధాని రైతులు

Published : Oct 30, 2017, 01:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
సింగపూర్ కు బయలుదేరిన రాజధాని రైతులు

సారాంశం

‘రాజధాని రైతులు సింగపూర్ కు వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది’ తాజాగా చంద్రబాబనాయుడు వ్యాఖ్య ఇది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల్లో సుమారు 123 మంది రైతులను ప్రభుత్వం సింగపూర్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా?

‘రాజధాని రైతులు సింగపూర్ కు వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది’ తాజాగా చంద్రబాబనాయుడు వ్యాఖ్య ఇది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల్లో సుమారు 120 మంది రైతులను ప్రభుత్వం సింగపూర్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా?

లాటరీ పద్దతిలో ఎంపిక చేసి మూడు బ్యాచులుగా రైతులను సింగపూర్ తీసుకెళ్ళేందుకు సిఆర్డీఏ ఏర్పాట్లు చేసింది.  అందులో ఓ బ్యాచ్ సింగపూర్ కు బయలుదేరింది. ఆ విషయంలోనే చంద్రబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. రైతులు సింగపూర్ వెళ్ళటం బాగానే ఉంది. అయితే, వెళ్ళి ఏం చేస్తారు? ఏం చూస్తారన్నదే  అర్దం కావటం లేదు.

చంద్రబాబు మాట్లాడుతూ, సింగపూర్ తరహాలో రాజధాని ఉంటుందని ముందే చెప్పానంటున్నారు. ఇంకోవైపేమో ఆంధ్రుల చరిత్ర ఉట్టిపడేలాగ రాజధాని నిర్మాణముంటుందని చెబుతున్నారు. సింగపూర్ తరహాలో రాజధాని నిర్మాణాలుంటే, ఆంధ్రుల చరిత్ర ఎలా ఉట్టిపడుతుంది? సరే, రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతోనే అందరి నిర్ణయంతో రాజధానిపై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రధానప్రతిపక్షం వైసీపీతోనే మాట్లాడలేదు. ఇంకెవరితో మాట్లాడినట్లు?

 స్వచ్ఛందంగా ముందుకొచ్చి రైతులు భూములిచ్చారట. రాజధానిని ఆపేందుకు చాలామంది ఒత్తిడి తెచ్చినా రైతులు మాత్రం ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదన్నారు.  రాజధాని ప్రాంతంలోని రైతు కూలీలకు పింఛన్లు ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ పలువురు రైతులు తమ భూములు తమకు వాపసు ఇచ్చేయాలంటూ గోల చేస్తున్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.  ఒక విజయం మరో విజయానికి బాటలు వేస్తుందట. శ్రీకాంత్, సింధు వరుస విజయాలే అందుకు ఉదాహరణ అంటూ సంబంధం లేని ఓ పోలిక చెప్పారు.  

ఎడారి ప్రాంతాలైన దుబాయ్, అబుదాబి అద్భుత ప్రగతి సాధించాయన్నారు.  రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలట. ఎలా ఎదగాలో మాత్రం చెప్పలేదు.  పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలను గమనిస్తే సాధారణ స్థితి నుంచి వచ్చినవారే అన్నారు. భవిష్యత్తును అవగాహన చేసుకుని కష్టపడితే విజయం తథ్యంమన్నారు చంద్రబాబు.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu