పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీ‌ఏ రద్దు బిల్లులకు ఆమోదం: హైకోర్టులో మూడు పిటిషన్లు

By narsimha lodeFirst Published Aug 3, 2020, 3:32 PM IST
Highlights

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదంపై సోమవారం నాడు ఏపీ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అమరావతికి చెందిన రైతులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
 


అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదంపై సోమవారం నాడు ఏపీ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అమరావతికి చెందిన రైతులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ ఏడాది జూలై 31వ తేదీన ఆమోదించారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని  ఈ ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

also read:పంతం నెగ్గించుకొన్న జగన్: మూడు రాజధానులపై బాబు ఏం చేస్తారు

మూడు రాజధానుల బిల్లు( పాలనా వికేంద్రీకరణ బిల్లు)ను  గవర్నర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ  పిటిషన్ దాఖలైంది. మరో వైపు సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. 

జీఎన్ రావు కమిటీ, హై పవర్ కమిటీ, బోస్టన్ కమిటీ నివేదకలను సవాల్ చేస్తూ మూడో పిటిషన్ దాఖలయ్యాయి.  ఈ పిటిషన్లపై రేపు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మూడు పిటిషన్లపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసేందుకు వీలుగా శంకుస్థాపన జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అయితే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ఏర్పాటు చేయనున్నారు. కర్నూల్ ను జ్యూడీషీయల్ కేపిటల్ గా ఏర్పాటు చేయనున్నారు.
 

click me!