అది భయంకరమైన లేఖ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అంబటి ఫైర్

By telugu teamFirst Published Apr 25, 2020, 4:43 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వానికి మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లు చెబుతున్న లేఖపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. రమేష్ కుమార్ చంద్రబాబు చెప్పినట్లు చేశారని ఆయన అన్నారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ 18-3-2020న సెంట్రల్ హోం డిపార్ట్ మెంట్ కు ఒక లెటర్ రాశారని, ఇది భయంకరమైన ఉత్తరమని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. .ఇండిపెండెంట్ వ్యవస్ధ.... జ్యుడిషయరీలాగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమీషన్ రాయాల్సిన ఉత్తరం కాదని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు.

"ఒక విధంగా వారు రాసిన ఉత్తరం కూడా కాదు. ఇది ఎవరో రాస్తే ఆయన సంతకం పెట్టి పంపించారనే భావన సర్వత్రా వ్యాపించింది. ఉత్తరం చదివిన ప్రతివారికి ఆ భావన కలుగుతోంది. దానిపై విచారణ చేయాల్సిందిగా కోరడం,వి చారణ ప్రారంభం కావడం కూడా మనం చూశాం. విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తే కొంత ఆశ్చర్యం కలుగుతోంది" అని ఆయన అన్నారు.

"వారి పర్సనల్ సెక్రటరిగా ఉన్న సాంబమూర్తిని సిఐడివారు విచారణ చేస్తే అది డెస్క్ టాప్ ముందు తయారుచేయడం, తర్వాత లాప్ టాప్ కు పంపడం, తర్వాత పెన్ డ్రైవ్ ద్వారా రమేష్ కి పంపితే ఆయన హోంశాఖకు పంపించినట్లుగా ఆయన చెప్పారు.ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చూస్తే డెస్క్ టాప్,లాప్ టాప్ లలో ఫార్మాట్ చేశారు" అని రాంబాబు అన్నారు.

"పెన్ డ్రైవ్ లో అయినా ఉందా అంటే దానిని ధ్వంసం చేశారు. ఏంటిది....ఇది దేనికి సంకేతం. ఇంతకుముందు వ్యక్తమైన అనుమానాలను బలపరుస్తున్నాయా ....లేదా" అని ఆయన అన్నారు. "నిజంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా ఉన్నప్పుడు అధికారికంగా లెటర్ రాస్తే దాని ఆధారాలను లేకుండా చేయాల్సిన పరిస్ధితి ఎందుకు వచ్చింది" అని ప్రశ్నించారు.

"ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వతంత్రంగా వ్యవహరించలేదు... ఆయన ఒకరి చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరించారు.చంద్రబాబు ఏమీ చెబితే అది చేశారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు.. టిడిపి కార్యాలయంలో తయారు చేసిన ఉత్తరం మీద మాత్రమే రమేష్ కుమార్  సంతకం పెట్టారు తప్ప ఆయన ప్రిపేర్ చేసిన లెటర్ కాదు అనేటువంటి అనుమానాలు బలపడుతున్న సందర్భం" అని అంబటి అన్నారు.

"221 అని దీనికి రిఫరెన్స్ నెంబర్ ఇస్తే, ఆ నెంబర్ ఏమిటని అడిగితే టిడిపి ఎంఎల్సి అశోక్ బాబు రాసిన లెటర్ కిచ్చిన నెంబర్ ను దీనికి ఇచ్చారు. అంటే తప్పుచేసేటప్పుడు ఖచ్చితంగా ఆధారాలు వదిలిపెట్టి వెళ్తారనే నానుడి ఉంది. వాస్తవం కూడా. అదే విధంగా రమేష్ కుమార్ ఈ ర కమైన తప్పిదాలు.... చంద్రబాబు ఏం చెబితే అది చేసే దశకు వెెళ్లి పోయారు.కాబట్టి ఆయన రిఫరీగా పనికివస్తారా...పనికిరాడు" అని ఆయన అన్నారు.

"దీనిలో వాస్తవాలు మరింతగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు బయటకు వస్తాయి.అవి చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు. వాస్తవాలను ప్రజలు గమనిస్తారు.విచారణలో బయటకు వస్తాయి. దుర్మార్గమైన లెటర్ రాసి రాష్ర్ట ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసిన వ్యక్తులపై ప్రజలు,ప్రభుత్వాలు, న్యాయస్ధానాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లెటర్ మీడియాకు ఎక్కడనుంచి రిలీజ్ అయింది అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి విడుదల అయింది" అని రాంబాబు అన్నారు.

"అది విడుదల కాగానే మీడియా పర్సన్స్ అందరూ వెళ్లి రమేష్ కుమార్ ని అడిగితే ఆ లెటర్ గురించి నాకు తెలియదని చెప్పారు. అంతేకాదు అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లెటర్ కాదని నేషనల్ ఛానల్స్ లో కూడా చాలా వార్తలు వచ్చాయి. తర్వాత రమేష్ కుమార్ రాసినట్లుగానే చలామణి చేశారు. కాబట్టి ఆరోజున ఉన్న స్టేట్ ఎలక్షన్ కమీషన్ ఒక కుట్రపూరితంగానే వ్యవహరించిందనే వాస్తవాలు బయటకు వస్తున్న సందర్భం.దీ నిని ప్రజలు గమనించాలని కోరుతున్నాను" అని అంబటి రాంబాబు అన్నారు.

click me!