చేయి అడ్డం పెట్టి గంగిరెద్దును కాపాడిన జగన్: వీడియో వైరల్

Published : Jan 16, 2021, 08:22 AM IST
చేయి అడ్డం పెట్టి గంగిరెద్దును కాపాడిన జగన్: వీడియో వైరల్

సారాంశం

;చేయి అడ్డం పెట్టి గంగిరెద్దును గాయం కాకుండా కాపాడిన ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్సారాపుపేట కనుమ ఉత్సవాల్లో ఈ సంఘటన జరిగింది.

నర్సారావుపేట: గాయపడకుండా తన చేయి అడ్డం పెట్టి గంగిరెద్దును కాపాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  జగన్ శుక్రవారం గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటలో జరిగిన కనుమ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన స్టాల్స్ ను సందర్శిస్తూ వెళ్తున్మన క్రమంలో గంగిరెద్దు ఉన్న స్టాల్ వద్ద ఆగిపోయారు. వైఎస్ జగన్ ను ఆశీర్వదిస్తున్నట్లుగా గంగిరెద్దు తన తలను ఆడించింది. ఈ సమయంలో గంగిరెద్దు తల పక్కన ఉన్న ఫెన్సింగ్ రాడ్ ను కొట్టుకునేదే. అయితే, వెంటనే అప్రమత్తమైన జగన్ తన చేయిని గంగిరెద్దు తలకు ఆడ్డం పెట్టారు. 

ఆ తర్వాత గంగిరెద్దు తలను సున్నితంగా పక్కకు తప్పించాడు. గంగిరెద్దుకు చెందిన వ్యక్తికి జాగ్రత్తగా ఉండాలని జగన్ సూచించారు. అంతకు ముందు జగన్ గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం