
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడంలోని Fores chemical Factory కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం నాడు జరిగిన ప్రమాదంలో Six మృతి చెందారు. ఈ ఘటనను నిరసిస్తూ Factory ఎదుట గురువారం నాడు ఉదయం స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఈ ఫ్యాక్టరీలో ఇదే తరహలో ప్రమాదాలు జరిగాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. పదే పదే ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.
ఈ ఫ్యాక్టరీలోని నాలుగవ యూనిట్ లో Gas leak రియాక్టర్ పేలిందని ప్రాథమికంగా గుర్తించారు. ఘటన స్థలంలోనే ఐదుగురు మరణించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 13 మంది కార్మికులున్నారు. ఈ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్లను రంగంలోకి దించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తొలుత నూజివీడు ఆసుపత్రికి అక్కడి నుండి Vijayawada జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందికి 80 శాతం పైగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. బాధితుల పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు.
ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలను ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.