ముగిసిన దసరా సెలవులు.. టోల్‌ప్లాజాలు కిటకిట (వీడియో)

sivanagaprasad kodati |  
Published : Oct 21, 2018, 04:47 PM ISTUpdated : Oct 21, 2018, 05:54 PM IST
ముగిసిన దసరా సెలవులు.. టోల్‌ప్లాజాలు కిటకిట (వీడియో)

సారాంశం

దసరా సెలవులు ముగియడంతో నగరజీవి పల్లె నుంచి పట్నానికి బయలుదేరాడు...లాంగ్ వీకెండ్ రావడంతో బంధుమిత్రులతో కలిసి పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు తరలివెళ్లాడు. 

దసరా సెలవులు ముగియడంతో నగరజీవి పల్లె నుంచి పట్నానికి బయలుదేరాడు...లాంగ్ వీకెండ్ రావడంతో బంధుమిత్రులతో కలిసి పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు తరలివెళ్లాడు. నాలుగు రోజులు ఉల్లాసంగా గడిపి, ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తిరిగి భాగ్యనగరానికి బయలుదేరారు.

దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు రద్దీగా మారాయి.. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వద్ద టోల్‌ప్లాజాలపై వాహనాలు బారులు తీరాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్‌గేటు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. 6 గేట్లను హైదరాబాద్ వైపు, 5 గేట్లను విజయవాడ వైపుకు మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. సాయంత్రానికి రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 

"

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?