అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కు బెయిలు మంజూరు..

By SumaBala BukkaFirst Published Jun 9, 2023, 7:51 AM IST
Highlights

ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కు బెయిల్ మంజూరయ్యింది. గురువారం ఈ మేరకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

అమరావతి : భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు హైకోర్టు  బెయిలు మంజూరు చేసింది. నంద్యాల పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో షరతులతో కూడిన బెయిలు మంజూరు అయింది. భార్గవ్ రామ్ పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. గురువారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయ సూర్య ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.  మే 16వ తేదీన యువగళం యాత్ర నిర్వహిస్తున్న నారా లోకేష్ కి స్వాగతం పలకడానికి కొత్తపల్లి గ్రామం దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు.

ఆ సమయంలో జరిగిన గొడవల కారణంగా భార్గవ్ రామ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో వర్గ విభేదాల కారణంగా  భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులు తమ పార్టీనే అయిన టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డి మీద దాడికి పాల్పడ్డారు. దీంతో నంద్యాల పోలీసులు పలువురు మీద కేసులు నమోదు చేశారు.  అఖిల ప్రియను, ఆమె భర్త భార్గవరామ్, మరి కొంతమంది మీద  కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. 

వైఎస్ వివేకా హత్య కేసు: జగన్ కు ముందే తెలుసన్న సీబీఐ

ఈ కేసులో అఖిలప్రియ మొదటి నిందితురాలుగా ఉండగా  ఆమెతోపాటు మరికొందరికి స్థానిక కోర్టు బెయిలు మంజూరు చేసింది.  భార్గవరామ్ ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్నాడు. ఆయనను మే 17వ తేదీన అరెస్టు చేశారు. కాగా తనకు ఈ కేసులో బెయిలు మంజూరు చేయాలని భార్గవరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిమీద గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్ మీద సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. మే 17 నుంచి భార్గవ్ రామ్ జైల్లో ఉన్నారని.. ఆయన అసలు ఘటనలో పాల్గొనలేదని వాదించారు. భార్గవరామ్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ వాదనలను విన్న న్యాయమూర్తి.. వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని షరతులతో కూడిన బెయిలును మంజూరు చేశారు.

click me!