ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి కృష్ణా జిల్లా గుడివాడ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్కడి టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించి , లబ్ధిదారులతో జగన్ ముచ్చటించాల్సి వుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి కృష్ణా జిల్లా గుడివాడ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 16న సీఎం గుడివాడకు వెళ్లి టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి జగన్ .. గుడివాడ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మల్లాయపాలెం చేరుకుంటారు. అక్కడి టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించి , లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే జగన్ పర్యటన వాయిదా పడటానికి గల కారణాలు తెలియాల్సి వుంది.