అఖిలప్రియపై ఎమ్మెల్యే అసంతృప్తి: చంద్రబాబుకు ఫిర్యాదు

First Published Jun 6, 2018, 9:48 PM IST
Highlights

మంత్రి అఖిలప్రియకు మరోవైపు నుంచి కూడా ప్రతికూలత ఎదురవుతోంది.

అమరావతి: మంత్రి అఖిలప్రియకు మరోవైపు నుంచి కూడా ప్రతికూలత ఎదురవుతోంది. ఎవీ సుబ్బారెడ్డితో వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తున్న తరుణంలో బనగానపల్లె ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. 

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన బుధవారంనాడు కలిశారు. రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు జనార్థన్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అఖిలప్రియ కారణంగానే ఆయన పార్టీకి దూరమవుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఆయనను పార్టీ అధిష్టానం అమరావతికి పిలిచింది. బుధవారం ఆయన చంద్రబాబును కలిశారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, తన కష్టాలు చెప్పుకునేందుకే చంద్రబాబును కలిశానని భేటీ అనతంర జనార్దన్ రెడ్డి మీడియాతో చెప్పారు.

అయితే అఖిలప్రియపై ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్‌ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడులకే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటనకు కూడా దూరంగా ఉన్నారు.

click me!