Akbar Basha : ఇద్దరు కూతుర్లతో సహా పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం, దంపతుల పరిస్థితి విషమం.. !

By AN TeluguFirst Published Sep 21, 2021, 9:32 AM IST
Highlights

 భూ వివాదాన్ని పరిష్కరించాలని అక్బర్ బాషా  ఇటీవల సెల్ఫీ వీడియో తీశారు. అది వైరల్ కావడంతో.. భూమిని అక్బర్ బాషా కు ఇవ్వాలని స్వయంగా సీఎం జగన్ చెప్పారు. అయినా స్థానిక వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి సహకరించలేదు. సీఎం జగన్ కు భూమిని ఇచ్చినట్లు చెప్పి వైసీపీ నేతలు ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురై అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యయత్నం చేసింది. 

కడప : దువ్వూరు మండలం ఎర్రబల్లిలో అక్బర్ బాషా భూ వివాదం మరో టర్న్ తీసుకుంది. పురుగులమందు తాగి అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు పిల్లలతో సహా  అక్బర్ బాషా దంపతులు పురుగుల మందు తాగారు. అక్బర్ బాషా  దంపతుల పరిస్థితి విషమంగా ఉంది.

దీంతో వాళ్లను చాగలమర్రి ఆస్పత్రికి తరలించారు. భూ వివాదాన్ని పరిష్కరించాలని అక్బర్ బాషా  ఇటీవల సెల్ఫీ వీడియో తీశారు. అది వైరల్ కావడంతో.. భూమిని అక్బర్ బాషా కు ఇవ్వాలని స్వయంగా సీఎం జగన్ చెప్పారు. అయినా స్థానిక వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి సహకరించలేదు. సీఎం జగన్ కు భూమిని ఇచ్చినట్లు చెప్పి వైసీపీ నేతలు ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురై అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యయత్నం చేసింది. 

కాగా, సాక్షాత్ సీఎం జగన్ బంధువే తమ భూమిని ఆక్రమించారని ఆరోపించిన అక్బర్ బాషా  కుటుంబం సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనం సృష్టించింది. కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలో అక్బర్ బాషా భూ వివాదం నడుస్తుంది. కర్నూలు జిల్లా చాగలమర్రిలోని తమ సొంతింట్లో అక్బర్ బాషా, అతని భార్య అప్సానా, డిగ్రీ చదువుతున్న కూతురు హసీనా, ఇంటర్ చదువుతున్న ఇంకో కూతురు హసీబా.. నలుగురూ రాత్రి 9.30 గంటల సమయంలో ఇంట్లోనే పురుగుల మందు తాగా ఆత్మహత్యకు ప్రయత్నించారు. 

ఇది గమనించిన స్థానికులు, బంధువులు వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వివరాల్లోకి వెడితే.. అక్బర్ బాషా భార్య మేనత్త ఖాశింబీ స్వగ్రామం కడపజిల్లా ఎర్రబల్లి. ఈమెకు సర్వే నంబరు 225/1లో 1.50 ఎకరాల సాగు భూమి ఉంది. ఈమెకు పిల్లలు లేకపోవడంతో జీవితాంతం తన బాగోగులు చూడాలని అన్న కూతురు అప్సానా పేరున ఈ భూమిని 2009లో దాన విక్రయం (గిఫ్ట్ డీడ్) చేసింది. 

ఆ తరువాత అక్బర్ బాషా బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లడం, అప్సానా తన పిల్లలతో కలిసి చాగలమర్రికి వెళ్లి పోవడంతో తన బాగుగులు చూసుకోవడం లేదని ఖాశింబీ 2011లో సదరు గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసుకుంది. 2012లో వైసీపీ సీనియర్ నాయకుడు తిరుపాల్ రెడ్డి కుమారుడు విశ్వేశ్వరరెడ్డికి ఎకరా భూమి అమ్మింది. ఆయన జొన్నవరం రామలక్ష్మి రెడ్డికి దానికి విక్రయించారు. అయితే, కువైట్ నుంచి వచ్చిన అక్బర్ భాషా తన భూమి తనకివ్వాలని పట్టుపట్టాడు. 

‘ఆత్మహత్యే దిక్కు..’ వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో... విరుచుకుపడ్డ నారా లోకేష్, చంద్రబాబు... (వీడియో)

ఇది కోర్టుదాకా వెళ్లింది. ఖాశింబీకే ఆ భూమి మీద సర్వహక్కులూ ఉన్నాయనీ మైదకూరు కోర్టు తీర్పు ఇచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే, తన భార్యకు మేనత్త రాసిచ్చిన భూమిని వైసీపీ నాయకులు రెండేళ్లుగా అక్రమంగా సాగు చేసుకుంటున్నారని.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే..... ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని.. సీఎం జగన్ న్యాయం చేయకపోతే కుటుంబం మెత్తం ఆత్మహత్య చేసుకుంటామని ఈ నెల 10 వతేదీ రాత్రి 10.30 గంటల సమయంలో సెల్ఫ్ వీడియో తీసి సోషల్ మీడియాలో అక్బర్ బాషా పోస్ట్ చేశాడు. అది వైరల్ కావడంతో సీఎం కార్యాలయం, పోలీసులు స్పందించారు. అక్బర్ బాషా కుటుంబాన్ని కడప ఎస్సీ కార్యాలయానికి తీసుకెళ్లారు. 

ఆయన ఆరోపిస్తున్న వైసీపీ నాయకులను పిలిపించి మాట్లాడారు. వారి మధ్య ఏం జరిగిందో.. ఎలాంటి ఒప్పందం కుదిరిందో తెలియదుగానీ.. మరుసటి రోజే అక్బర్ బాషా కడపలో ప్రెస్ మీట్ పెట్టి తనకు న్యాయం జరిగిందని, జగన్ దేవుడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి అక్బర్ బాషా కుటుంబానికి అండగా ఉంటామని, ఆయన తమ కార్యకర్త అని, న్యాయం చేస్తామని పేర్కొన్నారు. 

ఇంతటితో కథ సుఖాంతమైందని అందరూ భావించారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి అక్బర్ బాషా సోమవారం ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం కలకలం రేపింది. కాగా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అక్బర్ బాషా కుటుంబం ఆరోగ్యంగానే ఉందని కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అన్నారు. 

click me!