తిరుమలలో విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా తిరుపతిలో విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.
తిరుపతి : తిరుమల కొండపై విమానం చక్కర్లు కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా చక్కర్లు కొడుతున్న విమానాలు. ఆగమశాస్త్ర నిబంధనలకు ఇది విరుద్ధం అంటున్నారు. ఆనందనిలయం మీదుగా విమానం ఎగరడం అపచారం అంటున్నారు భక్తులు. నిన్న అన్నదానం సముదాయం మీదుగావెళ్లిన విమానం.. నేడు గొల్ల మండపం మీదుగా మళ్లీ విమానం కనిపించింది.
ఇది ఏటీసీ అధికారుల నిర్లక్షం అని భక్తులు విమర్శిస్తున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని ప్రకటించారు అయినా ఎలాటి ఫలితం లేదు. గతంలో ఎల్ కే అద్వానీ, వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువెడితే చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. తిరుమలపై ఎలాంటి సంచారం లేకుండా ఆదేశాలివ్వాలని కోరినా ఫలితం లేదు. గత వారం రోజులుగా విమాన సంచారం ఎక్కువయ్యింది.
తరచూ ఆగమశాస్త్ర నిబంధనలు ఉల్లంఘించినా ఏటీసీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో యేడాదికొకసారో.. నెలకొకొసారో.. విమానం వెళ్లేది. కానీ వారం రోజులుగా ప్రతీరోజు విమానసంచారం జరుగుతుంది. టీటీడీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వారు విమానయాన రంగానికి ఫిర్యాదు చేస్తే ఈ సంచారాన్ని ఆపొచ్చని.. టీటీడీ భద్రతా అధికారుల సమన్వయ లోపం కనిపిస్తుందని భక్తులు అంటున్నారు.