బెజవాడ రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్లలో ఎంఐఎం పోటీ చేస్తోంది. అభ్యర్ధులకు మద్ధతుగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ ప్రచారం చేస్తున్నారు.
బెజవాడ రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్లలో ఎంఐఎం పోటీ చేస్తోంది. అభ్యర్ధులకు మద్ధతుగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ ప్రచారం చేస్తున్నారు.
కొంతకాలం క్రితం వరకు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైందని భావించిన ఎంఐఎం నెమ్మదిగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం.. కొద్ది రోజుల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.
ఇక మొదటిసారి గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగి మంచి ఫలితాలు రాబడుతోంది. తాజాగా ఏపీలోనూ మజ్లిస్ ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.