సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి సంబంధించి మరో 15 మందిని సిట్ బృందం అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.ఈ విధ్వంసం వెనుక ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్:Secundrabad రైల్వే స్టేషన్ లో విధ్వసానికి సంబంధించి దర్యాప్తును SIT మరింత వేగవంతం చేసింది. ఈ కేసుతో ప్రమేయం ఉందనే అనుమానంతో మరో 15 మందిని Railway పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఈ నెల 17వ తేదీన Agnipath కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో Army ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటికే 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 11 మంది పరారీలో ఉన్నారని రైల్వే పోలీసులు Remand Report లో పేర్కొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి సంబంధం ఉందనే అనుమానంతో 15 మందిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి నిందితులు వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని కూడా పోలీసులు గుర్తించారు.ఈ విషయాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. మరో వైపు ఈ విధ్వంసాల వెనుక ఎవరి పాత్ర ఉందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విధ్వంసాల వెనుక ప్రైవేట్ Defence అకాడమీల పాత్ర ఉందని రైల్వే ఎస్పీ Anuradha రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఏయే డిఫెన్స్ అకాడమీలు దీని వెనుక ఉన్నాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని డిఫెన్స్ అకాడమీలను గుర్తించామని రైల్వే పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే 56 మందిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. .మరో 11 మంది పరారీలో ఉన్నారని కూడా రిమాండ్ రిపోర్టు తెలిపింది. ఈ కేసులో 11 మందిని సాక్షులుగా చేర్చినట్టుగా రిమాండ్ రిపోర్టులో ప్రకటించారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్, ఛలో సికింద్రాబాద్ ఏఆర్ఓ 3, ఆర్మీ జీడీ 2021 మార్చ్ ర్యాలీ, సీఈఈ సోల్జర్ గ్రూపులు క్రియేట్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒక్క వాట్సాప్ గ్రూప్ ఆడ్మిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఏడు గ్రూప్ ఆడ్మిన్లు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
సాయి డిఫెన్స్ అకాడమీలో ముగిసిన తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సరావుపేటకు చెందిన Sai Defence అకాడమీలో ఐబీ అధికారుల తనిఖీలు మంగళవారం నాడు ఉదయం ముగిశాయి. సోమవారం నుండి ఈ అకాడమీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక ప్రైవేట్ డిఫెన్స్ కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అకాడమీలో ఐబీ అధికారులు తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లను IB అధికారులు తీసుకెళ్లారు.