ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం..

Published : Jun 21, 2022, 12:46 PM IST
ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం..

సారాంశం

ఎమ్మెల్సీ అనంతబాబు అలియాస్ అనంత ఉదయభాస్కర్ చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అపర్ణకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగమిచ్చారు. 

ఎమ్మెల్సీ అనంతబాబు అలియాస్ అనంత ఉదయభాస్కర్ చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అపర్ణకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగమిచ్చారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) చట్టం కింద ఈమెకు ఉద్యోగమిస్తూ కలెక్టర్‌ కృతికా శుక్లా సోమవారం అపర్ణ ఉత్తర్వులను అందజేశారు.. అపర్ణ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతురావుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇక, సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్ర్ జైలులో ఉన్నారు. అతనికి కోర్టు జూలై 1వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 

ఇక, ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యం గత నెలలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇది స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనంతబాబుపై సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే జిల్లా ఉన్నతాధికారులు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. వారికి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. పలు నాటకీయ పరిణామాల తర్వాత ఈ కేసులో పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ వేటు వేసింది. 

ఆ తర్వాత వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అట్రాసిటీ పరిహారం అందజేసింది. జి మామిడాడలోని సుబ్రహ్మణ్యం ఇంటిని ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ సందర్శించారు.  సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం, సుబ్రహ్మణ్యం తమ్ముడు నవీన్‌కు ఒప్పంద ఉద్యోగం ఇస్తామని తెలిపారు. సుబ్రహ్మణ్యం తల్లికి, భార్యకు ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేశామని చెప్పారు. నెల రోజుల్లో రెండున్నర ఎకరాల సాగుభూమిని అందించనున్నామని తెలిపారు. మొత్తం రూ.8.50 లక్షల పరిహారంలో.. రూ.4.12 లక్షల చెక్కును కాకినాడ ఆర్డీఓ బీవీ రమణ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!