చంద్రబాబు మరీ అంత లోకువైపోయాడా ?

First Published Dec 1, 2017, 11:54 AM IST
Highlights
  • తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు చంద్రబాబునాయుడు బాగా లోకువైపోయారు.

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు చంద్రబాబునాయుడు బాగా లోకువైపోయారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీని మొదటిసారి సిఎం అయిన కెసిఆర్ ఎంతలా నిర్లక్ష్యం చేస్తున్నారో తాజాగా జరుగుతున్న ఘటనలను చూస్తుంటేనే అర్దమైపోతోంది. చంద్రబాబు విషయంలో కెసిఆర్ ఎందుకలా వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇంతకీ మ్యాటరేంటంటారా? చదవండి మీకే తెలుస్తుంది.. పోయిన నెల 28వ తేదీన హైదరాబాద్ లో రెండు ముఖ్య ఘట్టాలు చోటు చేసుకున్న విషయం అందరకీ తెలిసిందే కదా?

ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైలు ప్రారంభంతో పాటు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జిఇఎస్) జరిగింది. మెట్రో ప్రారంభమంటే ఓ గంట కార్యక్రమం. ఇక జిఇఎస్ అయితే మూడు రోజుల పాటు జరిగింది. ఇక్కడ మెట్రోనా లేక జిఇఎస్సా అన్నది ముఖ్యం కాదు. రెండు కార్యక్రమాల్లోనూ ముఖ్య అతిధులుగా ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహదారు హోదాలో ఇవాంకా ట్రంప్ హాజరయ్యారు. అందుకే రెండు కార్యక్రమాలు అంత ప్రతిష్టాత్మకమయ్యాయి.

రెండు కూడా హైదరాబాద్ లోనే జరుగుతున్నపుడు కెసిఆర్ కు చంద్రబాబు గుర్తుకు రాలేదా? రెండు కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కనీసం పిలవాలని కూడా కెసిఆర్ అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. రెండు కార్యక్రమాల్లోనూ పిలవనందుకు చంద్రబాబు కూడా గిలగిలలాడిపోయారు. నిజంగా చంద్రబాబును కెసిఆర్ అవమానించినట్లే అని చాలా మంది ఫీలయ్యారు.

సరే ఏదో అయిపోయిందిలే అనుకుని సర్దుకున్నారు. అయితే, ‘మానిపోయిన పుండును మళ్ళీ కెలుకుతున్నట్లు’గా వ్యవహరిస్తున్నారు కెసిఆర్. ఇంతకీ విషయమేంటంటే, తర్వలో హైదరాబద్ లోనే మొదలవ్వనున్న ‘ప్రపంచ తెలుగు మహాసభల’కు చంద్రబాబును పిలవాలని కెసిఆర్ నిర్ణయించారట. ఉన్నతాధికారుల సమీక్షలో కెసిఆర్ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబును పిలవాలంటూ గట్టిగా చెప్పారట. ఎలాగుంది కెసిఆర్ యవ్వారం.

పిలవాల్సిన కార్యక్రమాలకు పిలవకుండా చంద్రబాబును కావాలనే పక్కనపెట్టటమేంటి? మళ్ళీ ప్రపంచ తెలుగు మహాసభలకు మాత్రం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవాలని ఉన్నతాధికారులకు గట్టిగా చెప్పటమేంటి? ఇదంతా కెసిఆర్ కావాలనే చేస్తున్నట్లు కనిపించటం లేదూ ?

tags
click me!