Adoni Assembly elections result 2024 : ఆదోనీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE

Published : Jun 04, 2024, 10:42 AM IST
Adoni Assembly elections result 2024 : ఆదోనీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE

సారాంశం

Adoni Assembly elections result 2024 live : భౌగోళికంగా, జనాభాపరంగా ఆదోనీని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్థాలుగా వుంది. ఇక్కడి ప్రజలు ఈ పట్ణణాన్ని రెండో ముంబైగా పిలుచుకుంటారు. కన్నడ రాజకీయాలు కూడా ఈ ప్రాంతంపై ప్రభావం చూపుతాయి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,57,640 మంది. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. మీనాక్షి నాయుడు టీడీపీ నుంచి, వై సాయిప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి మూడేసి సార్లు గెలిచారు.  ఆదోనీ నుంచి నాలుగోసారి కూడా సాయిప్రసాద్ రెడ్డే నిలబడ్డారు. చంద్రబాబు మీనాక్షీ నాయుడును పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టారు.

Adoni Assembly elections result 2024 live : వ్యాపారం, వాణిజ్యం , రాజకీయాలపరంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనీకి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం వుంది. ఇక్కడి ప్రజలు ఈ పట్ణణాన్ని రెండో ముంబైగా పిలుచుకుంటారు. ఇక్కడ వందలాది సంఖ్యలో ఆయిల్, పత్తి మిల్లులు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. భౌగోళికంగా, జనాభాపరంగా ఆదోనీని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్థాలుగా వుంది.

కర్నూలు జిల్లా కేంద్రానికి దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో వుండటంతో ప్రజలు అవసరాల కోసం అక్కడి వరకు వెళ్లడానికి వ్యయ ప్రయాసలకు గురయ్యేవారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోనీ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాలు ఓ మూలకు విసిరేసినట్లు కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా వుంటాయి. కన్నడ రాజకీయాలు కూడా ఈ ప్రాంతంపై ప్రభావం చూపుతాయి. దీనికి తోడు కరువు ప్రాంతం కావడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఆదోనీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. 

రాజకీయాల విషయానికి వస్తే.. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,57,640 మంది. వీరిలో పురుషులు 1,27,903 మంది.. మహిళలు 1,29,688 మంది. ఆదోనీ పట్టణం, మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పట్టణ, గ్రామీణ ప్రాంత ఓటర్ల సమ్మేళనంగా ఈ ప్రాంతం వుంటుంది. ఆదోనీ ప్రజలు అన్ని పార్టీలను , వర్గాలను అక్కున చేర్చుకున్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, స్వతంత్ర అభ్యర్ధులు ఇక్కడి నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. మీనాక్షి నాయుడు టీడీపీ నుంచి, వై సాయిప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి మూడేసి సార్లు గెలిచారు. 

ఆదోనీ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. 

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి వై సాయిప్రసాద్ రెడ్డికి 74,109 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కొంకా మీనాక్షీ నాయుడుకు 61,790 ఓట్లు పోలయ్యాయి. సాయిప్రసాద్ రెడ్డి 12,319 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. 2024 ఎన్నికల విషయానికి వస్తే.. ఆదోనీ నుంచి  నాలుగోసారి సాయిప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. 

టీడీపీ విషయానికి వస్తే.. ఆదోనీ ఒకప్పుడు ఆ ప్రాంతానికి బాగా పట్టున్న ప్రాంతం. బీసీ జనాభా పెద్ద సంఖ్యలో వుండటంతో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పాటు సాయిప్రసాద్ రెడ్డి వ్యూహాలు టీడీపీ కోటను బీటలు వారేలా చేశాయి. అయితే ఈసారి మీనాక్షీ నాయుడు పార్టీ అభ్యర్ధిగా నిలబడ్డారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?