నెల్లిమర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

Published : Jun 04, 2024, 10:36 AM ISTUpdated : Jun 06, 2024, 05:10 PM IST
నెల్లిమర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

సారాంశం

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా సతివాడ, భోగాపురం సెగ్మెంట్లు రద్దయి.. భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల, డెంకాడ మండలాలతో భోగాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో నుంచి నేటి వరకు ఇక్కడ మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి అప్పలనాయుడు, 2014లో టీడీపీ అభ్యర్ధి పతివాడ నారాయణ స్వామి నాయుడు, 2019లో వైసీపీ తరపున అప్పలనాయుడు విజయం సాధించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జ్యూట్ మిల్లు నెల్లిమర్లలోనే వుంది. అప్పలనాయుడుకు మరోసారి టికెట్ కేటాయించారు సీఎం వైఎస్ జగన్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి జనసేన నెల్లిమర్ల స్థానాన్ని దక్కించుకుంది. లోకం మాధవిని అభ్యర్ధిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. అలాగే రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జ్యూట్ మిల్లు నెల్లిమర్లలోనే వుంది. 1920లో స్థాపించిన ఈ మిల్లు.. వేల మందికి ఉపాధి కల్పించింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఈ ప్రాంతంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 

గతంలో వున్న సతివాడ, భోగాపురం నియోజకవర్గాలు రద్దయి.. వాటి స్థానంలో నెల్లిమర్ల ఏర్పడింది. గతంలో వున్న భోగాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట.. ఇక్కడ ఇదే ఇద్దరే నేతలు రాజకీయాలను శాసించారు. 1962 నుంచి 1978 వరకు కాంగ్రెస్ నేత కొమ్మురాజు అప్పడు దొర వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ ఆవిర్భావంతో పతివాడ శకం మొదలైంది. 1983 నుంచి 2004 వరకు పతివాడ నారాయణ స్వామి నాయుడు డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశారు. 

నెల్లిమర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. పతివాడ, పెనుమత్సల హవా: 

ఇక సతివాడ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇది పూర్తిగా కాంగ్రెస్ కంచుకోట. 1967 నుంచి 2004లో నియోజకవర్గం రద్దయ్యే వరకు 1994లో తప్పించి మిగిలిన అన్ని ఎన్నికల్లో హస్తం పార్టీదే గెలుపు. పెనుమత్స సాంబశివరాజు ఆరుసార్లు విజయం సాధించి సత్తా చాటారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా సతివాడ, భోగాపురం సెగ్మెంట్లు రద్దయి.. భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల, డెంకాడ మండలాలతో భోగాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో నుంచి నేటి వరకు ఇక్కడ మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి అప్పలనాయుడు, 2014లో టీడీపీ అభ్యర్ధి పతివాడ నారాయణ స్వామి నాయుడు, 2019లో వైసీపీ తరపున అప్పలనాయుడు విజయం సాధించారు. 

2009 ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడుపై బొత్స మేనల్లుడైన అప్పలనాయుడు విజయం సాధించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2019లోనూ నారాయణ స్వామి నాయుడుపై అప్పలనాయుడు మరోసారి విజయం సాధించి సత్తా చాటారు. అప్పుడు అప్పలనాయుడుకు 94,258 ఓట్లు.. నారాయణ స్వామి నాయుడుకు 66,207 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 28,051 ఓట్ల మెజారిటీతో వైసీపీ తొలిసారిగా నెల్లిమర్లలో పాగా వేసింది.

నెల్లిమర్ల శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. పట్టు నిలుపుకోవాలని.. 

2024 ఎన్నికల విషయానికి వస్తే.. అప్పలనాయుడుకు మరోసారి టికెట్ కేటాయించారు సీఎం వైఎస్ జగన్. సంక్షేమ పాలనను అప్పలనాయుడు నమ్ముకున్నారు. అయితే ఇక్కడి స్థానిక నేతల నుంచి ఆయనకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెల్లిమర్ల టికెట్ ఆశించిన బొత్స లక్ష్మణరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసేన బీజేపీ కూటమి నుంచి జనసేన నెల్లిమర్ల స్థానాన్ని దక్కించుకుంది. లోకం మాధవిని అభ్యర్ధిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. 

నెల్లిమర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందింది. వైఎస్సార్‌సీపీ చెందిన అప్పలనాయుడుపై జనసేన పార్టీకి చెందిన లోకం నాగ మాధవిపై విజయం సాధించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్